రైతుకు సాయం చేసి మంచి మనస్సు చాటుకున్న శేఖర్ కమ్ముల.. ఏమైందంటే?

యువతకు నచ్చే సినిమాలను తెరకెక్కించి విజయాలను అందుకుంటున్న దర్శకునిగా శేఖర్ కమ్ములకు పేరు ఉందనే సంగతి తెలిసిందే.శేఖర్ కమ్ముల సినీ కెరీర్ లో హ్యాపీడేస్, ఫిదా, లవ్ స్టోరీ లాంటి బ్లాక్ బస్టర్ హిట్లు ఉన్నాయి.

 Movie Director Sekhar Kammula Helped One Lakh Ruppes To A Farmer In Suryapeta District-TeluguStop.com

అయితే ఈ దర్శకుడు తాజాగా మంచి మనస్సును చాటుకున్నారు.ఒక న్యూస్ ఛానెల్ లో వచ్చిన వార్తకు స్పందించి శేఖర్ కమ్ముల గొప్ప మనస్సును చాటుకున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళితే తెలంగాణ రాష్ట్రంలోని సూర్యాపేట జిల్లా మునగాల మండలంలోని నేలమర్రి అనే గ్రామానికి చెందిన లక్ష్మయ్య అనే రైతు వ్యవసాయ భూమిని అమ్మగా అతని వాటాగా ఏకంగా 10 లక్షల రూపాయలు వచ్చాయి.గుడిసెలో నివాసం ఉంటున్న లక్ష్మయ్య ఆ డబ్బుతో ఇల్లు నిర్మించుకోవాలని అనుకున్నాడు.

 Movie Director Sekhar Kammula Helped One Lakh Ruppes To A Farmer In Suryapeta District-రైతుకు సాయం చేసి మంచి మనస్సు చాటుకున్న శేఖర్ కమ్ముల.. ఏమైందంటే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మొత్తం 10 లక్షల రూపాయలలో ఆరు లక్షల రూపాయలు ఇంటిలోని బీరువాలో పెట్టాడు.

ఇంటికి సంబంధించిన పనులను ప్రారంభించడంతో పాటు మేస్త్రీని కలిసి ఇతర వివరాలను తెలుసుకున్నాడు.

Telugu Dhanush, Farmer Family, Farmer Lakshmayya, Fidaa, Happy Days, Love Story, One Lakh Rupees, Sekhar Kammula, Sekhar Kammula Helped Farmer, Suryapeta District-Movie

ఈ నెల 21వ తేదీన వంట గ్యాస్ ను వెలిగించిన సమయంలో లీకైన గ్యాస్ సిలిండర్ పేలడంతో గుడిసె పూర్తిగా కాలిపోయింది.బీరువాలో ఉన్న డబ్బులు మొత్తం కాలిపోవడంతో లక్ష్మయ్య బాధ పడగా ఈ వార్త నెట్టింట వైరల్ అయింది.శేఖర్ కమ్ముల లక్ష రూపాయలను లక్ష్మయ్య ఖాతాకు నేరుగా బదిలీ చేయడం గమనార్హం.

Telugu Dhanush, Farmer Family, Farmer Lakshmayya, Fidaa, Happy Days, Love Story, One Lakh Rupees, Sekhar Kammula, Sekhar Kammula Helped Farmer, Suryapeta District-Movie

భవిష్యత్తులో కూడా రైతు ఫ్యామిలీకి అండగా ఉంటానని శేఖర్ కమ్ముల లక్ష్మయ్యకు తెలిపారు.రైతును ఆదుకొని శేఖర్ కమ్ముల మంచి మనస్సును చాటుకోవడంతో నెటిజన్లు ఆయనను ప్రశంసిస్తున్నారు.శేఖర్ కమ్ములలా మరి కొందరు ప్రముఖులు ఆర్థిక సహాయం అందిస్తే రైతుకు, రైతు కుటుంబానికి మేలు జరిగే ఛాన్స్ అయితే ఉంది.

శేఖర్ కమ్ముల తర్వాత సినిమాలో ధనుష్ హీరోగా నటించనున్నారు.

#SekharKammula #Suryapeta #Love Story #Happy #Sekhar Kammula

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube