మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలిచిన సినీ ప్రముఖులు వీళ్లే?

Movie Artist Association Selected Members Details Here

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి.ప్రకాష్ రాజ్, మంచు విష్ణు మధ్య హోరాహోరీ పోరు ఉంటుందని అందరూ భావించినా విష్ణు సునాయాసంగా ఎన్నికల్లో విజయం సాధించారు.

 Movie Artist Association Selected Members Details Here-TeluguStop.com

మంచు విష్ణు అధ్యక్ష పీఠానికి ఎన్నిక కావడంతో తన ప్యానెల్ సభ్యులను సైతం గెలిపించుకున్నారు.మంచు విష్ణు ప్యానెల్ తరపున జనరల్ సెక్రటరీ పదవికి పోటీ చేసిన రఘుబాబు జీవితా రాజశేఖర్ పై 7 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు.

విష్ణు ప్యానెల్ నుంచి వైస్ ప్రెసిడెంట్ పదవికి మాదాల రవి ఎంపికయ్యారు.ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పదవి కోసం ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి శ్రీకాంత్ , మంచు విష్ణు ప్యానల్ నుంచి బాబు మోహన్ పోటీ పడగా హోరాహోరీ పోరులో చివరకు శ్రీకాంత్ విజయం సొంతం చేసుకున్నారు.

 Movie Artist Association Selected Members Details Here-మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో గెలిచిన సినీ ప్రముఖులు వీళ్లే-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ట్రెజరర్ పదవికి ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి నాగినీడు, విష్ణు ప్యానల్ నుంచి శివబాలాజీ పోటీ చేయగా శివబాలాజీ 32 ఓట్ల ఆధిక్యంతో నాగినీడుపై విజయం సాధించారు.

మంచు విష్ణు ప్యానల్ నుంచి జాయింట్ సెక్రటరీ పదవికి గౌతమ్ రాజు ఎంపికయ్యారు.ప్రకాష్ రాజ్ ప్యానెల్ లో జాయింట్ సెక్రటరీ పదవికి పోటీ చేసిన ఉత్తేజ్ విజయం సాధించారు.ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి వైస్ ప్రెసిడెంట్ గా బెనర్జీ విజయం సాధించారు.

మంచు విష్ణు ప్యానల్ నుంచి హరినాథ్, మాణిక్, బొప్పన విష్ణు, శ్రీలక్ష్మీ, శ్రీనివాస్, పూజిత, శశాంక్ ఈసీ మెంబర్స్ గా విజయం సాధించారు.

ప్రకాష్ రాజ్ ప్యానల్ నుంచి కౌశిక్, శివారెడ్డి, అనసూయ, సురేష్ కొండేటి విజయం సాధించారు.బ్రహ్మాజీ, సంపూర్ణేష్ బాబు, ఖయ్యూమ్ ఈసీ మెంబర్స్ గా గెలిచినట్లు సమాచారం అందుతోంది.ప్రకాష్ రాజ్ ప్యానల్ కు చెందిన 11 మంది ఈసీ మెంబర్లుగా గెలవగా విష్ణు ప్యానల్ కు చెందిన 7 మంది మాత్రమే ఈసీ మెంబర్స్ గా ఎన్నికయ్యారు.

#Madala Ravi #Srikanth #Manchu Vishnu #Uttej #Artist

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube