పెళ్లిపై షాకింగ్ కామెంట్లు చేసిన ఛార్మీ.. ఆ తప్పు చేయనంటూ..?

గత రెండు రోజుల నుంచి సోషల్ మీడియాలో, వెబ్ మీడియాలో ఛార్మీ పెళ్లికి సంబంధించి వార్తలు తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే.ఛార్మీ అభిమానులు సైతం ఆమె పెళ్లి వార్తలు నిజమేనని భావించారు.

 Movie Actor Chaarmee Kaur About Marriage Rumours-TeluguStop.com

తల్లిదండ్రులు చూసిన వ్యక్తిని పెళ్లి చేసుకోబోతున్నారని జోరుగా ప్రచారం జరిగింది.పెళ్లికి సంబంధించి వార్తలు తెగ వైరల్ కావడంతో తాజాగా ఛార్మీ స్పందించి వైరల్ అయిన వార్తలకు సంబంధించి స్పష్టతనిచ్చారు.

ప్రస్తుతం నిర్మాతగా కొన్ని సినిమాలు నిర్మిస్తున్న ఛార్మీ ప్రస్తుతం కెరీర్ పరంగా తాను గొప్ప క్షణాలను అనుభవిస్తున్నానని పేర్కొన్నారు.ప్రస్తుతం జీవిస్తున్న జీవితం ఎంతో సంతోషంగా ఉందని.

 Movie Actor Chaarmee Kaur About Marriage Rumours-పెళ్లిపై షాకింగ్ కామెంట్లు చేసిన ఛార్మీ.. ఆ తప్పు చేయనంటూ..-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తన లైఫ్ లో పెళ్లి చేసుకోవడం లాంటి తప్పును మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయనని ఛార్మీ వెల్లడించారు.గతంలోనే పెళ్లికి సంబంధించి ఒకసారి వార్తలు వైరల్ కాగా తాజాగా మరోసారి వైరల్ అయిన వార్తలకు చెక్ పెట్టారు.

ప్రస్తుతం ఛార్మీ విజయ దేవరకొండ హీరోగా తెరకెక్కుతున్న లైగర్ సినిమాతో బిజీగా ఉన్నారు.పెళ్లికి తన అభిప్రాయాన్ని వెల్లడించి జీవితంలో మళ్లీ పెళ్లి చేసుకునే ఉద్దేశం తనకు లేదని ఛార్మీ వెల్లడించారు.

చిన్న వయస్సులోనే నటిగా కెరీర్ ను మొదలుపెట్టిన ఛార్మీ స్టార్ హీరోల సినిమాల్లో సైతం అవకాశాలను అందిపుచ్చుకున్నారు.ఒక దశలో ఛార్మీ నటించిన సినిమాలు వరుస ఫ్లాపులు కావడంతో ఆమెకు ఆఫర్లు తగ్గాయి.

Telugu Charmee Kaur, Marriage Rumours, Movie Actor, Producer Offers-Movie

ఆ తరువాత ఛార్మీ నిర్మాతగా మారారు.నిర్మాతగా కూడా ఛార్మీకి కొన్ని ఎదురుదెబ్బలు తగిలాయి.అయితే ఛార్మీ మాత్రం నిర్మాతగా కెరీర్ ను కొనసాగిస్తూ ఇస్మార్ట్ శంకర్ సినిమాతో భారీ లాభాలను అందుకున్నారు.లైగర్ సినిమాతో ఆమె మరో సక్సెస్ ను ఖాతాలో వేసుకుంటానని భావిస్తున్నారు.

పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

#Producer Offers #Charmee Kaur

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు