ముందు సీరియల్స్ లో నటించి ఆ క్రేజ్ తో హీరోయిన్స్ గా ఛాన్స్ లు దక్కించుకున్న వారు ఉంటారు.వారిలో నాగిని భామ మౌనీ రాయ్ కూడా ఉంది.
నాగిని సీరియల్ తో నేషనల్ వైడ్ పాపులర్ అయిన మౌనీ రాయ్ త్వరగానే పెళ్లి చేసుకుని ఫ్యాన్స్ కి షాక్ ఇచ్చినా సినిమా ల్లో నటించడం మాత్రం మానలేదు.అంతేనా తన గ్లామర్ ట్రీట్ ఇవ్వడంలో కూడా వెనక్కి తగ్గలేదు.
మౌనీ రాయ్ రీసెంట్ గా బ్రహ్మాస్త్ర మొదటి భాగం శివ సినిమాలో నటించింది.
సినిమాల కన్నా ఫోటో షూట్స్ మీద అమ్మడు ఎక్కువ దృష్టి పెడుతుంది.
లేటెస్ట్ గా శారీ లుక్ తో కత్తిలాంటి ఫోజులు ఇచ్చింది అమ్మడు.అందాల భామ ఏం కట్టినా ఏం చుట్టినా అందమే అన్నట్టుగా శారీ లో మౌనీ రాయ్ అదరగొట్టేసింది.
సినిమాల్లో తన పాత్రలతో మెప్పిస్తూ సోషల్ మీడియాలో తన గ్లామర్ షో అందిస్తూ ఆడియన్స్ లో తనకంటూ ఒక బ్రాండ్ ఏర్పరచుకుంటుంది మౌనీ రాయ్.బాలీవుడ్ లో ఛాన్స్ లు తగ్గినా సౌత్ కి వచ్చినా అమ్మడికి క్రేజీ అవకాశాలు వస్తాయని చెప్పొచ్చు.