హలో మేడమ్.. వాళ్ళు మనుషులే అలాంటి ఓవర్ యాక్షన్ చెయ్యకండి!

సాధారణంగా సెలబ్రిటీలు బయటకు వెళ్ళినప్పుడు చాలా అసౌకర్యానికి గురవుతుంటారు.ఎందుకంటే వారి అభిమానులు సెల్ఫీ ల కోసం ఆటోగ్రాఫ్ ల కోసం ఎగపడుతూ ఉంటారు.

 Mouni Roy Gets Uncomfortable After Unruly Fans Try To Touch Her, Mouni Roy, Unco-TeluguStop.com

ఇక బాడీగార్డ్ లేకుండా పబ్లిక్ లోకి సెలబ్రెటీలు వెళితే ఇక అంతే సంగతులు.మామూలుగానే సెలబ్రిటీలకు బాడీగార్డులు ఉన్న తోపులాటలు జరుగుతూ ఉంటాయి.

అలాంటిది ఒంటరిగా వెళ్తే ఎలా ఉంటుందో మీరే అర్థం చేసుకోవచ్చు.ఇలా బయటకు వెళ్లిన క్రమంలో ముఖ్యంగా హీరోయిన్ లను అభిమానులు నానా ఇబ్బందులకు గురి చేస్తారు.

ఈ క్రమంలోనే పలువురు సహనాన్ని కోల్పోయి అరవడం, కొట్టడం లాంటివి చేస్తూ ఉంటారు.తాజాగా అలాంటి అనుభవమే ఒకటి బాలీవుడ్ బ్యూటీ మౌని రాయ్ కు ఎదురయ్యింది.

ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అసలేం జరిగిందంటే… ఇటీవల జుహు లోని రికార్డింగ్ స్టూడియో నుండి మౌనిక రాయ్ బయటకు రాగానే అభిమానులు సెల్ఫీల కోసం ఆమె పైకి దూసుకు వచ్చి చుట్టుముట్టారు.

ఈ క్రమంలోనే ఒక వ్యక్తి ఆమె బాడీని తాకేందుకు ప్రయత్నిస్తున్నాడు అనుకొని ఆమె వెంటనే ఉలిక్కిపడి అరేయ్ అంటూ అరవడం చూడవచ్చు.

ఈ వీడియోపై నెటిజన్ లు కొందరు పాజిటివ్ గా స్పందించ గా, ఇంకొందరు నెగిటివ్ గా స్పందిస్తున్నారు.కొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తూ.సెలబ్రిటీలు అసౌకర్యానికి గురికాకుండా కొంత డిస్టెన్స్ పాటించాలి అని కామెంట్ చేస్తున్నారు.

ఇంకొందరు ఆమెకు వ్యతిరేకంగా కామెంట్ చేస్తూ.ప్లీజ్ మేడం వాళ్ళు కూడా మానవులే.

జంతువులు కాదు అని నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు.మొత్తానికి ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ బ్యూటీకి సోషల్ మీడియాలో 20 మిలియన్ లకు పైగా ఫాలోవర్స్ ఉన్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube