లాక్ డౌన్ కష్టాలు తలుచుకొని బాధపడుతున్న బాలీవుడ్ బ్యూటీ  

Mouni Roy Bollywood - Telugu Bollywood, Celebrities, Corona Effect, Indian Cinema, Lock Down, Mouni Roy Is Stuck In Abu Dhabi, Tollywood

కరోనా కారణంగా ప్రపంచం అంతా లాక్ డౌన్ లోకి వెళ్ళిపోయింది.సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకు అందరూ లాక్ డౌన్ కష్టాలు అనుభవిస్తున్నారు.

 Mouni Roy Bollywood

పొట్టకూటి కోసం వలస వెళ్ళిన వాళ్ళు బ్రతుకుజీవుడా అనుకుంటూ కాలినడకన సొంతూళ్ళకి తిరిగి వచ్చారు.ఇక సినిమా షూటింగ్ లు, ఫోటో షూట్ ల కోసం బయట దేశాలకి వెళ్లి ఇరుక్కుపోయిన తారలు చాలా మంది ఉన్నారు.

మలయాళీ స్టార్ హీరో పృధ్వీరాజ్ బ్రిటన్ లో తన టీంతో చిక్కుకుపోయి మరల వందే భారత్ మిషన్ లో భాగంగా పంపిన విమానాల ద్వారా ఇండియా తిరిగి వచ్చాడు.ఇలాంటి కష్టాలనే బాలీవుడ్ ముద్దుగుమ్మ, నాగిని సీరియల్ తో ఫేమస్ అయిన మౌనీరాయ్ కూడా అనుభవిస్తుంది.

లాక్ డౌన్ కష్టాలు తలుచుకొని బాధపడుతున్న బాలీవుడ్ బ్యూటీ-General-Telugu-Telugu Tollywood Photo Image

లాక్‌డౌన్‌ కారణంగా రెండు నెలలుగా ఈ అమ్మడు దుబాయ్‌లోనే ఉంటోంది.ఓ మ్యాగజైన్‌ ఫొటో షూట్‌ కోసం మార్చి నెలలో ఆమె యూఏఈకి వెళ్లింది.నాలుగు రోజుల వర్కింగ్‌ ట్రిప్‌ కోసం వెళ్లి రెండు నెలలుగా అక్కడే ఉండాల్సి వచ్చింది.ప్రస్తుతం ఓ ఫ్రెండ్‌తో కలిసి ఉంటోంది.

పశ్చిమ బెంగాల్‌లోని కుటుంబాన్ని తలుచుకుంటూ ఆమె తెగ బాధపడుతోంది.ఫొటో షూట్‌ అయిపోయిన తర్వాత ఓ రెండు వారాలు దుబాయ్‌లో గడుపుదామని అనుకున్నాను.

దానికి తోడు ఏప్రిల్‌ 15 వరకు నా చేతుల్లో ఏ ప్రాజెక్టు పనికూడా లేదు.నేను చేసిన కాస్త నిర్లక్ష్యానికి ఎంతో విలువ చెల్లించుకోవాల్సి వస్తుందని ఆమె తన ఆవేదన చెప్పుకుంటుంది.

నాలుగు జతల బట్టలతో ఉంటున్నాను.నా సోదరుడు మా అమ్మదగ్గర ఉండి చూసుకుంటున్నాడు.

ఇండియాకు తిరిగి రావడం కోసం ఎదురుచూస్తున్న అంటూ తన ఆవేదనని మీడియాతో పంచుకుంది.మొత్తానికి లాక్ డౌన్ కష్టాలు ఎప్పుడు కలల ప్రపంచంలో ఉండే సెలబ్రిటీలకి పూర్తిగా కనువిప్పు కలిగించింది అనడంలో మాత్రం ఎలాంటి అతిశయోక్తి లేదనే అనాలి.

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

footer-test