ఫ్యాన్సీ నెంబర్లను హాట్ కేక్స్ లా కొంటున్న వాహనదారులు...!

ఈ మధ్యకాలంలో కొందరు వాహనాలు కొనుగోలు చేసిన నేపథ్యంలో వారి వాహనానికి కావలసిన నెంబర్ కోసం.ఏకంగా వాహనం కోసం పెట్టిన ఖర్చు కంటే నెంబర్ కోసం ఎక్కువ ఖర్చు పెడుతున్నారు.

 Motorists Buying Fancy Numbers Like Hot Cakes  Motor Cycles, Cars, Fancy Numbers-TeluguStop.com

ఇప్పుడు వాహన నెంబర్ కూడా ఓ స్టేటస్ సింబల్ గా మారిపోయింది.చాలా మంది ధనికులు వారి స్టేటస్ కోసం లక్షల్లో ఖర్చు చేసి మరీ వారికి నచ్చిన ఫ్యాన్సీ నెంబర్ ను చేజిక్కించుకుంటున్నారు.ప్రస్తుతం కరోనా నేపథ్యంలో ఈ ఫ్యాన్సీ నెంబర్లకు ఏమైనా డిమాండ్ తగ్గుతుందేమో అని భావించినా దాని క్రేజ్ మాత్రం ఎక్కడా తగ్గలేదు.2014 నుండి రవాణాశాఖ ఫ్యాన్సీ నెంబర్ ల కోసం ఆన్ లైన్ లో ఈ – వేలం నిర్వహిస్తోంది.ఇలా ఆన్లైన్లో నెంబర్ దక్కించుకునేందుకు చాలామంది పోటాపోటీగా లక్షల రూపాయలను ఖర్చు పెట్టేస్తున్నారు.

మరికొందరు ఫ్యాన్సీ ప్రజలు వారి లక్కీ నెంబర్ కోసం ఎన్ని లక్షలైనా ఖర్చు పెట్టేస్తున్నారు.తాజాగా ఢిల్లీ రవాణా శాఖ చేపట్టిన వేలం లో 0009 సిరీస్ ఉన్న నెంబర్ ను రిజిస్ట్రేషన్ కోసం ఏకంగా 10.1 లక్షల రూపాయలు ఖర్చు పెట్టారు.ఇక అదే సిరీస్ నెంబర్ ను జూలై నెలలో ఓ వ్యక్తి 7.1 లక్షలు ఖర్చుపెట్టి కొనుగోలు చేశాడు.ఇక అలాగే 003, 007 లాంటి ఇతర సిరీస్ లో కూడా పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తున్నారు వాహనదారులు.003, 007 సిరీస్ లకు గాను 3.1 లక్షలకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.ప్రస్తుతం కరోనా వైరస్ నేపథ్యంలో ఎక్కడికైనా వెళ్లాలంటే వాహనదారులు వారి సొంత వాహనాల్లోనే ప్రయాణించడానికి ఇష్టపడుతున్నారు.

నిజానికి లాక్ డౌన్ సమయంలో ఆటోమొబైల్ సంస్థ ఎంతగానో నష్టపోయిన, ప్రస్తుతం అన్ లాక్ ప్రక్రియ తర్వాత ఆటోమొబైల్ రంగం రిజిస్ట్రేషన్లు అమాంతం పెరిగిపోతున్నాయి.దీంతో ఇప్పుడు ఫ్యాన్సీ నెంబర్ల ధరలు కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి.

తాజాగా ఢిల్లీ రవాణాశాఖకు గత నెలలో ఏకంగా 99 లక్షలకు పైగా ఫ్యాన్సీ నెంబర్లకు సంబంధించి ఆదాయం లభించింది.దేశంలో ఇప్పుడిప్పుడే అన్ని వ్యాపార రంగాలు తెరుచుకోవడంతో ఆర్థిక వ్యవస్థ గాడిలో పడుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube