బాబు పై మరోసారి విరుచుకుపడ్డ మోత్కుపల్లి  

Motkupalli Once Again Criticized Chandra Babu-

గత కొంత కాలంగా ఏపీ మాజీ సి ఎం చంద్రబాబు పై తీవ్ర స్థాయిలో విమర్సలు చేస్తున్న మాజీ టీడీపీ నేత మోత్కుపల్లి మరోసారి తనదైన శైలి లో విరుచుకుపడ్డారు.నిన్న వెలువడిన సార్వత్రిక ఎన్నికల ఫలితాల్లో టీడీపీ ఘోర పరాజయం మూటకట్టుకున్న సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో మోత్కుపల్లి మాట్లాడుతూ… బాబు ఒక దొంగ,ప్రజా ద్రోహి అతడి నిజస్వరూపం బయట పడేందుకు 25 సంవత్సరాలు పట్టింది అంటూ వ్యాఖ్యానించారు.ఎవరినైనా వాడుకొని వదిలేసే వ్యక్తి చంద్రబాబు అని నాకు గవర్నర్,రాజ్యసభ పదవి ఇస్తానని చెప్పి మోసం చేశారని మండిపడ్డారు..

Motkupalli Once Again Criticized Chandra Babu--Motkupalli Once Again Criticized Chandra Babu-

అలానే రాజ్యసభ సీట్లు ఒక్కక్కటి వంద కోట్లకు అమ్ముకున్నారు అంటూ మోత్కుపల్లి ఆరోపించారు.అలానే ఓటుకు నోటు కేసుకు సంబంధించి కూడా మోత్కుపల్లి విమర్శలు చేశారు.

తెలంగాణా లో టీడీపీ ని బతికిస్తాను అని చెప్పడం తో నన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

తెలంగాణ లో బాబు ను ప్రజలు తరిమి కొట్టారు.ఇప్పుడు ఏపీ ప్రజలు కూడా తరిమి కొట్టారని మోత్కుపల్లి వ్యాఖ్యానించారు.నైతిక విలువలు ఉంటే ఎమ్మెల్యే, పార్టీ అధ్యక్ష పదవికి చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

తెలుగుదేశం జెండా నీది కాదు.నందమూరి వాళ్ల జెండాయేనని.

మరోవైపు సార్వత్రిక ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ పార్టీ కి ఆపార్టీ అధినేత జగన్ కు శుభాకాంక్షలు తెలిపారు.చంద్ర ద్రబాబు ఇక సెలవు తీసుకో.నువ్వు పెద్ద కొడుకువి కాదు.పెద్ద తాతవు.

పెద్ద కొడుకు అంటే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అంటూ మోత్కుపల్లి వ్యాఖ్యానించారు.