చేతులు లేక‌పోయినా ఈమె చేస్తున్న ప‌నులు చూస్తే హ్యాట్సాప్ చెప్పాల్సిందే..

సాధించాల‌నే త‌ప‌న ఉంటే ఎలాంటి ప‌ని అయినా చేయ‌గ‌లుగుతాం.అందుకు ఎలాంటి కార‌ణాలు మ‌న‌కు అడ్డురావు.

 Jessica Cox Inspirational Story, Jessica Cox, Jessica Cox Pilot, Jessica Cox Bip-TeluguStop.com

కొంద‌రు అన్నీ బాగానే ఉన్నా సోమ‌రిపోతుల్లా ఉంటారు.కానీ ఓ అమ్మాయి మాత్రం త‌న‌కు రెండు చేతులు లేక‌పోయినా కూడా ఎన్నో అద్భుతాలు చేసి చూపెడుతోంది.

అమెరికా దేశంలోని అరిజోనా ప‌ట్ట‌ణానికి చెందిన‌టువంటి జెస్సీకా కాక్స్ అనే అమ్మాయికి చిన్న‌త‌నంలో పుట్టుకతోనే చేతులు లేకుండానే పెరిగింది.కానీ ఆమె దాన్ని శాపంగా భావించి బాధ ప‌డుతూ కూర్చోకుండా తానేంటో నిరూపించుకోవాల‌నుకుంది.

అంద‌రిలాగే తాను కూడా త‌న జీవితాన్ని ఆశ్వాదిస్తూ ఆనందంగా జీవించాల‌ని అనుకుంది.దీంతో సాధార‌ణ మ‌నుషుల్లాగా ఆమె కూడా ఎన్నో విష‌యాల‌ను ఎంతో సునాయాసంగా నేర్చుకోవ‌డం ఇప్పుడు అంద‌రినీ షాక్‌కు గురి చేస్తుంది.

ఆమె రెండు చేతులు లేక‌పోయినా కూడా కారు నడపేస్తోంది.అంతే కాదు పియానో కూడా వాయిస్తుంది.

ఇంకో ముఖ్య‌మైన విష‌యం ఏంటంటే సాధార‌ణ మ‌నుషులే భ‌య‌ప‌డే ప‌ని కూడా చేస్తుంది.త‌న కాళ్ల‌తో ఏకంగా విమానాన్ని కూడా నడుపుతూ అంద‌రినీ ఆశ్చ‌ర్యానికి గురి చేస్తోంది.

Telugu Handicapped, Jessica Cox, Jessicacox-Latest News - Telugu

ఇలా అన్ని రంగాల్లో రాణిస్తూ తానేంటో నిరూపిస్తోంది.అటు బాక్సింగ్‌లో కూడా ఆమె స‌త్తా చాటుతూ ఇప్ప‌టికే రెండు బ్లాక్‌ బెల్ట్ ల‌ను కూడా సొతం చేసుకుంది.కాగా త‌న‌కు బాక్సింగ్‌లో ట్రైనింగ్ ఇచ్చిన‌టువంటి పాట్రిక్ అనే వ్య‌క్తినే పెండ్లి చేసుకుని జీవితాన్ని ఆస్వాదిస్తోంది.ఇక తన లాంటి వారు ఉన్న చోట‌నే ఆగిపోకుండా చూడాలనే సంక‌ల్పంతో మోటివేషనల్‌ స్సీకర్‌గా మారి అంద‌రిలోనూ ఆత్మ స్థైర్యాన్ని పెంచుతోంది.

అంతే కాదు ఆమె వికలాంగుల హక్కుల కోసం నిత్యం పోరాడుతూ ఎంద‌రికో అండ‌గా నిలుస్తోంది.ఎంతైనా ఇలాంటి వారు ఎంద‌రికో స్ఫూర్తి దాయం క‌దా.ఇలాంటి వారిని చూసైనా కొంద‌రు మారాల‌ని కోరుకుందాం.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube