వింత : నెల గ్యాప్‌లో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది... వారు కవలలు కాదు  

Mother With \'two Wombs\' Gives Birth To Twins In One Month Gap-bangladesh Mother Discovers Twins In Second Uterus,mother With \\'two Wombs\\',telugu Viral News,viral In Social Media

ఒకే కాన్పులో పుట్టే వారిని కవల పిల్లలు అంటారు, కవల పిల్లల మద్య తేడా కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. కొందరికి సెకన్ల తేడానే ఉంటుంది. అయితే కవల పిల్లలు చాలా అరుదుగా కొన్ని గంటల తేడాతో లేదంటే ఒకటి రెండు రోజుల తేడాతో కూడా కవలలు పుట్టడం మనం విన్నాం...

వింత : నెల గ్యాప్‌లో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చింది... వారు కవలలు కాదు-Mother With 'two Wombs' Gives Birth To Twins In One Month Gap

కాని ఒక మహిళ నెల రోజుల గ్యాప్‌లో ఏకంగా ముగ్గురు పిల్లలకు జన్మనివ్వడం అనేది అత్యంత అరుదైన విషయంగా చెప్పుకోవాలి. మొదటి డెలవరీ తర్వాత ఆమె నార్మల్‌ మనిషి అయ్యిందని అనుకున్నారు. ఆమె కూడా తాను ఇక గర్బవతిని కాదు అని భావించింది.

కాని అనూహ్యంగా నెల లోపే మళ్లీ ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది. ఆ ముగ్గురు శిషువులు కూడా ఆరోగ్యంగా ఉండటం విశేషం.

ఈ అరుదైన, వింత సంఘటన బంగ్లాదేశ్‌లో జరిగింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే…

మగ బిడ్డతో అరిఫా మరియు ఆమె కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా కాలం గడిపేస్తున్నారు. ఆ సమయంలోనే నెలలోపే అంటే మార్చి 22వ తారీకున మరోసారి అరిఫాకు విపరీతమైన కడుపు నొప్పి వచ్చింది. అవి పురిటి నొప్పులు అని హాస్పిటల్‌కు వెళ్లిన తర్వాత ఆమెకు అర్థం అయ్యింది. అక్కడ వైధ్యులు స్కానింగ్‌ మరియు ఇతర టెస్టులు చేసిన తర్వాత ఆమె గర్బంలో కవలలు ఉన్నట్లుగా గుర్తించారు...

అవాక్కయిన అరిఫా కుటుంబ సభ్యులు నమ్మలేక పోయారు.

సాదారణ డెలవరీ కష్టం అని, ఆపరేషన్‌ చేయాలని చెప్పారు. అందుకు అరిఫా కుటుంబ సభ్యులు సమ్మతించడంతో ఆపరేషన్‌ చేసి కవల పిల్లలను తీశారు. అయితే మొదట పుట్టిన బాబు, తర్వాత పుట్టిన కవలలు ఒకే గర్బాశయం నుండి రాలేదు.

అంటే వారు ముగ్గురు కూడా కవలలు కాదు అని వైధ్యులు అంటున్నారు. రెండు విభిన్నమైన గర్బాశయాలు ఆమెకు ఉన్నాయి...

అందుకే ఆమె గర్బం రెండు సార్లు దాల్చింది. మొదటి గర్బశయం ద్వారా ఒక సారి గర్బవతి అవ్వగా, కొన్ని రోజులకు రెండవ గర్బాశయం ద్వారా గర్బవతి అయ్యింది.

అందుకే నెల రోజుల తేడాతో ఆమె రెండు సార్లు డెలవరీ అయ్యిందని వైధ్యులు అంటున్నారు. రెండు కాన్పులుగా వీటిని లెక్కించాలని మొదట పుట్టిన బాబును కవల బాబుగా గుర్తించడం కుదరదు అంటున్నారు. మొత్తానికి ప్రపంచంలోనే అత్యంత వింతైన అరిఫా పిల్లలు, డెలవరీ విషయం ప్రస్తుతం వైరల్‌ అవుతుంది...

తమ ముగ్గురు పిల్లతో అరిఫా మరియు కుటుంబ సభ్యులు చాలా సంతోషంగా ఉన్నారు.