తెరపైకి మదర్ థెరిస్సా బయోపిక్! టైటిల్ రోల్ పోషిస్తున్న ప్రముఖ నటి!  

తెరపైకి మదర్ థెరిస్సా బయోపిక్. ఫస్ట్ ఇండియన్ హాలీవుడ్ మూవీ. .

  • మదర్ థెరిస్సా… ఈ పేరుని ప్రత్యేకంగా ఎవరికి పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఒక విదేశీ వనిత ఇండియా వచ్చి, ఇక్కడ ప్రజల కోసం, బడుగు, బలహీన వర్గాల కోసం పాటుపడిన సేవా మూర్తి. పశ్చిమ బెంగాల్ లో ఆమె క్రిస్టియన్ మిషనరీతో, మురుకివాడలలో ఉండే ప్రజలకు విశేషంగా సేవలు అందించింది. ఆమె చివరి ఊపిరి వరకు మానవసేవే మాధవసేవ అనే నినాదంతో అంటరానివారుగా ముద్రవేయబడ్డ ప్రజలకి సేవ చేసిన ధీర వనితగా ప్రపంచ నోబెల్ శాంతి బహుమతిని సైతం అందుకుంది. ఆమె చనిపోయి రెండు దశాబ్దాలు గడిచిన ఇప్పటికి భారతీయులందరూ ఆమె స్మరించుకుంటూ వుంటారు.

  • అలాంటి శాంతి దూత మదర్ థెరిస్సా జీవిత కథ అంటే ఎవరికైనా కచ్చితంగా ఆసక్తి వుంటుంది. ఇప్పుడు ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై మదర్ థెరిస్సా జీవిత కథని ఆవిష్కరించే ప్రయత్నం జరుగుతుంది. బాలీవుడ్ దర్శకురాలు సీమ ఉపాధ్యాయ్ ఈ సినిమాని దర్శకత్వం చేయడానికి రెడీ అవుతుంది. ఇక ఈ భారీ తారాగణంతో భారీ బడ్జెట్ తో తెరకెక్కే ఈ సినిమా కోసం హాలీవుడ్, బాలీవుడ్ ఆర్టిస్ట్ లని తీసుకోవడానికి రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది. ఇక మదర్ థెరిస్సా పాత్ర కోసం హాలీవుడ్ కి చెందిన ప్రముఖ నటిని సంప్రదిస్తున్నట్లు సమాచారం.