టీవీ చూస్తుంది అన్న కోపం తో ఐదేళ్ల కూతురిని చితక్కొట్టిన టీచర్... మృతి  

Mother Teacher Beaten Child Died In Kattuputhur In Tamilnadu -

“ఉపాధ్యాయురాలు” అంటేనే ఆ పదానికి ప్రతి ఒక్కరి జీవితంలో ప్రత్యేక స్థానం ఉంటుంది.ఎంతో ఓర్పు తో నేర్పు తో విద్యార్థులను భావితరాలకు అందించాల్సిన భాద్యత వారిపై ఉంటుంది.

Mother Teacher Beaten Child Died In Kattuputhur In Tamilnadu

అలాంటి ఉపాధ్యాయురాలు తప్పు చేస్తే ఇక విద్యార్థులు మాత్రం ఏమి నేర్చుకుంటారు.

పాఠశాల లో ఎంతో మంది విద్యార్థుల మధ్య సహనం తో ఉండాల్సిన ఉపాధ్యాయురాలు సహనం కోల్పోయి తన కన్న బిడ్డ ప్రాణాలు తీశారు.ఈ ఘటన తమిళనాడులోని తిరుచ్చి జిలా కాట్టుపుదూర్ లో చోటుచేసుకుంది.ప్రభుత్వ పాఠశాల లో టీచర్ గా విధులు నిర్వహిస్తున్న ఒక ఉపాధ్యాయురాలు చదవకుండా టీవీ చూస్తుంది అన్న కారణంగా కన్న కూతురిని దారుణంగా కొట్టడం తో ఆ చిన్నారి మృతి చెందినట్లు తెలుస్తుంది.

టీవీ చూస్తుంది అన్న కోపం తో ఐదేళ్ల కూతురిని చితక్కొట్టిన టీచర్… మృతి-General-Telugu-Telugu Tollywood Photo Image

గవర్నమెంట్ టీచర్‌ అయిన నిత్యకమల.తన ఐదేళ్ల కుమార్తె లతికా శ్రీని చదువుకోవాలని కోరింది.ఆ చిన్నారి అంతగా పట్టించుకోకుండా టీవీ చూస్తూ ఉండిపోయింది.దీంతో కోపంతో ఊగిపోయిన నిత్య కమల.చదవడంలేదని తన కూతురిని దారుణంగా కొట్టింది.దీంతో ఆ చిన్నారి తీవ్రంగా గాయపడింది.

అయితే వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ ఆ చిన్నారి చికిత్స పొందుతూ కన్నుమూసింది.దీనితో ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టినట్లు తెలుస్తుంది.

తాజా వార్తలు