జీనియస్ తల్లి, పిల్లల అల్లరిని కంట్రోల్ చేయడానికి ఏమిచేసిందంటే!

ఇంట్లో చిన్న పిల్లలు ఉన్నారు అంటే ఇక ఆ ఇంటి గురించి మాట్లాడుకోవాల్సిన పనిలేదు.ఒకప్పుడు అబ్బాయి కదా బాగా అల్లరి ఎక్కువగా ఉంటుంది అని పెద్దవాళ్లు అనేవారు.

 Mother Super Trick To Keep Her Children Clam And Still-TeluguStop.com

కానీ ఇప్పుడు అమ్మాయి,అబ్బాయి అన్న తేడా లేదు.చిన్న పిల్లలు అంటేనే ఆ ఇంటి లో భీభత్సమే నెలకొంటుంది.

అయితే అలాంటి పిల్లలను కంట్రోల్ చేయడానికి ఒక జీనియస్ తల్లి చేసిన పనికి నెటిజన్లు సైతం ఫిదా అయిపోతున్నారు.ఇంతకీ ఆ తల్లి ఏమి చేసిందంటే ఒక చిన్న ట్రిక్ ప్లే చేసింది.

అదే రాత్రిళ్లు మాత్రమే మెరిసే డ్రస్ లను వారికి కొని అందులో స్టార్లు రీఛార్జ్ కావలి అంటే ఉదయం లైట్ కింద సైలెంట్ గా ఉండాలని వారికి చెప్పింది.ఇక అంతే ఆ పిల్లలు కూడా రాత్రి పూట ఆ లైట్ లు వెలగడం కోసం అని అటు ఇటూ కదలకుండా ఉదయం మొత్తం కూడా లైట్ కిందే పడుకొని ఉన్నారు.

పొద్దున్న లెగిసింది మొదలు వారు పడుకొనే వరకు కూడా ఒక్క క్షణం కూడా వెస్ట్ చేయకుండా అల్లరి చేస్తూనే ఉంటారు.ఇలాంటి హైపర్ యాక్టివ్ ఉన్న పిల్లలను ఎలా కంట్రోల్ చేయాలో అని తల్లి దండ్రులు తమ తలలు పట్టుకొని కూర్చుంటూ ఉంటారు.

అలాంటి వారికి ఈ జీనియస్ తల్లి ఇచ్చిన ట్రిక్ బాగా పనిచేస్తుంది అని చెప్పాలి.ఇదే విషయాన్నీ ఆ తల్లి కూడా షేర్ చేసింది.

మీరు కూడా మీ పిల్లలకు ఇలాంటి డ్రస్ లను కొని వారు ఉదయం స్నానం చేయగానే అందుబాటులో ఉండే విధంగా ఆ డ్రస్ లను వారి అల్మారా లో పెట్టి, ఆ తరువాత ఇలా అని విషయం చెప్పి చూడండి ఖచ్చితంగా వారు కదలకుండా లైట్ కిందే పడుకొని ఉంటారు అని తెలిపింది.అయితే ఈ జీనియస్ తల్లి ట్రిక్ కు నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

నిజంగా పిల్లలను ఇలా కంట్రోల్ చేయొచ్చు అన్న ఒక్క చిన్న ట్రిక్ చెప్పి ఆమె సోషల్ మీడియా లో జీనియస్ తల్లి గా నిలిచింది.మరి ఈ ట్రిక్ ని ఎంతమంది ఫాలో అవుతారో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube