సంగారెడ్డి జిల్లా లో విషాద ఘటన,ఐసోలేషన్ లో మృతి చెందిన త‌ల్లీ కొడుకు ...

తెలంగాణా లోని సంగారెడ్డి జిల్లా లో విషాద ఘటన చోటుచేసుకుంది.ఆ జిల్లా లోని నారాయణ్ ఖేడ్ లో తల్లి,కొడుకు ఇద్దరూ కూడా గంటల వ్యవధిలో కరోనా తో కన్నుమూసినట్లు తెలుస్తుంది.

 Mother And Son Dead With Corona In Narayankhed At Sangareddy District , Narayank-TeluguStop.com

దేశ‌వ్యాప్తంగా క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో దేశవ్యాప్తంగా మృతుల సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతుండడం మరింత ఆందోళన కలిగిస్తుంది.తాజాగా సంగారెడ్డి జిల్లా లో చోటుచేసుకున్న ఈ విషాద ఘటన మరింత కలవర పెడుతుంది.

నారాయణఖేడ్ పట్నణంలో నివాసం ఉండే ఓ వ్య‌క్తి క‌రోనా బారిన‌ప‌డ‌డంతో ఇంటి ద‌గ్గ‌రే ఉంటూ చికిత్స తీసుకుంటున్నాడు.

అయితే.

ఆ ఫ్యామిలీలో మొత్తం ఎనిమిది మందికి క‌రోనా పాజిటివ్‌గా నిర్ధార‌ణ అవ్వగా ఇంటివద్దనే హోం ఐసోలేషన్ లో ఉంచాడు అధికారులు.వారంతా హోం ఐసోలేష‌న్‌లోనే ఉండి చికిత్స తీసుకుంటుండ‌గా నిన్న రాత్రి ఆమె సడన్ గా మృతిచెందింది.

అయితే,తల్లి చనిపోయిన కొద్దిసేపటికే కొడుకు కూడా మృతిచెంద‌డం తో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం నెలకొంది.ఒకే కుటుంబంలో ఇద్దరు కొద్దీ గంటల వ్యవధిలోనే మృత్యు ఒడిలోకి వెళ్లడం తో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

మండలంలోని చల్లగిద్ద తండాకు చెందిన ఈ కుటుంబం నారాయణఖేడ్ లో నివాసం ఉంటున్నారు.ఇంట్లో ఇద్దరు కొడుకులు, కోడళ్లతో పాటు ఇంటి పెద్ద మహిళకు ఇలా కుటుంబంలో 8 మందికి కరోనా పాజిటివ్ వచ్చింది.

నాలుగు రోజుల క్రితమే వారందరికీ కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు ఫలితాలు వచ్చాయి.

ఈ క్రమంలోనే ఇంటిలోనే హోం ఐసోలేషన్ లో ఉండగా ఉన్నట్టుండి ఇలాంటి హఠాన్పరిమాణం చోటుచేసుకోవడం తో మిగిలిన కుటుంబ సభ్యులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

మరోపక్క వారు మృతి చెందడం తో వారి మృత దేహాలను నారాయణ్ ఖేడ్ నుంచి చల్లగిద్ద తండాకు తరలించవద్దు అంటూ తండావాసులు సూచిస్తున్నట్లు తెలుస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube