హైదరాబాద్ లో దారుణం జరిగిపోయింది.ప్రపంచంలో వెలకట్టలేని ఆస్తి తల్లి అని ఎక్కువ మంది పూజించే తల్లినే కడతేర్చాడో కసాయి కొడుకు.
ఈ ఘటనతో స్థానికులు ఒక్క సారిగా షాక్ కు లోనయ్యారు.ఇంతకీ ఆ కొడుకు తల్లిని ఎందుకు కడతేర్చాడో కనుక తెలిస్తే తప్పకుండా షాక్ అవుతారు.
అర్ధరాత్రి పూట కొడుకు చేస్తున్న ఎక్సర్ సైజులకు తల్లి అడ్డు చెప్పిందనే కోపంతో ఆ కొడుకు తల్లిని వ్యాయామాలు చేసే రాడ్ తో బలంగా కొట్టి చంపాడు.దీంతో ఆమెకు తీవ్ర రక్తస్రావమయి ప్రాణాలను కోల్పోయింది.
తల్లి మీద దాడి చేసేటపుడు బాధితురాలి కూతురు అడ్డు రావడంతో చెల్లి అని చూడకుండా ఆ కిరాతకుడు ఆమె మీద కూడా దాడి చేశాడు.దీంతో ఆమె తీవ్ర గాయాలపాలయింది.
కానీ అదృష్టవశాత్తూ ఆమె బతికింది.ప్రస్తుతం గాయాలతో ఉన్న ఆమెను స్థానికలు పోలీసులు కలిసి ఆసుపత్రిలో జాయిన్ చేయించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే…
స్థానిక సుల్తాన్ బజార్ ప్రాంతంలో పాపమ్మ అనే మహిళ నివాసం ఉంటోంది.ఆమెకు ఒక కొడుకు సుధీర్, కూతురు ఉన్నారు.
కొడుకు సుధీర్ కు మతి స్థిమితం లేదు.సుధీర్ ఎప్పుడు ఎటువంటి పనులు చేస్తాడో అతడికే తెలియదు.సుధీర్ అర్ధరాత్రి 2.30 సమయంలో బిగ్గరగా కేకలు వేస్తూ వ్యాయామాలు చేయడం ప్రారంభించాడు.
ఇలా సుధీర్ అర్ధరాత్రి పూట కేకలు వేయడంతో అక్కడ ఉన్న స్థానికులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారని గ్రహించిన పాపమ్మ కొడుకును ఇదేంటని మందలించింది.తనకే అడ్డు చెబుతావా? అని సుధీర్ కోపంతో తన తల్లిని బలంగా కొట్టి చంపాడు.అడ్డు వచ్చిన చెల్లిని కూడా గాయపర్చాడు.స్థానికులు పోలీసులకు సమాచారం అందిచడంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు పాపమ్మను మార్చురీకి, తన కూతురును మెరుగైన వైద్యం కోసం ఉస్మానియాకు తరలించారు.