10,000 పైగా మొక్కలు నాటింది , 107 ఏళ్ల వయస్సులో పద్మ శ్రీ అందుకున్న తిమ్మక్క కథ

మనం ఎక్కడికైనా ప్రయాణిస్తున్నప్పుడు మధ్యలో కాసేపు విశ్రాంతి తీసుకోవాలంటే ఏదో చెట్టు నీడకి వెళ్లి కాసేపు విశ్రాంతి తీసుకుంటాం , కానీ అలా మనకు నీడనిచ్చే చెట్లను నాట డానికి సమయం ఇవ్వలేము .కానీ కర్ణాటకలోని బెంగళూరు రూరల్ జిల్లా, హులికల్ గ్రామానికి చెందిన దంపతులు ఒకటి కాదు రెండు కాదు దాదాపు 400 వరకు మర్రి చెట్లను పెంచారు వాటితో పాటు 8000 ఇతర మొక్కల్ని పెంచారు ఆ దంపతులే సాలుమరద తిమ్మక్క – చిక్కన్న.ఈమె సేవకు గాను ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వం పద్మ శ్రీ అవార్డ్ తో పుస్కరించింది.

 Mother Of Trees Saalumarada Thimmakka Receives Padma Award-TeluguStop.com

107 సంవత్సరాల తిమ్మక్క గత 50 ఏళ్ల నుండి మొక్కల్ని పెంచుతూ ఉన్నారు , భర్త చిక్కయ్య 1990 లొనే మరణించారు .అయిన తను మాత్రం మొక్కల్ని పెంచడం ఆపలేదు.

అసలు తిమ్మక్క దంపతులు మొక్కల్ని నాటడం ఎలా ప్రారంభించారు ?

అలరామరడ తిమ్మక్క చిక్కన్న దంపతులకు పెళ్లి అయిన కొన్ని సంవత్సరాల వరకు పిల్లలు పుట్టలేదు .దంపతులిద్దరూ చాలా బాధపడ్డారు .ఆ సమయం లొనే తిమ్మక్క మొక్కల్ని పెంచి వాటినే తన పిల్లల్లా చూసుకోవాలని అనుకుంది.అప్పటి నుండి భర్తతో కలిసి మొక్కల్ని నాటడం ప్రారంభించింది.ఆమె భర్త చిక్కన్న భార్య నాటిన చెట్లను జాగ్రత్తగా నీళ్ళు పోసి పెంచడం కోసం జీతం కోసం చేస్తున్న పని కూడా వదిలిపెట్టాడు.

ఆ సమయంలో తిమ్మక్క సంపాదనే ఆ కుటుంబానికి జీవనాధారం అయింది.

తిమ్మక్క ఇంటి పేరు

సాలుమరద అంటే కన్నడ భాషలో వృక్షాల వరుస అని అర్థం.ఈమె హులికుల్ నుండి కుడుర్ వరకు ఉన్న జాతీయ రహదారి పక్కన నాలుగు కిలోమీటర్ల మేర 400 వరకు మర్రి చెట్లు పెంచడం ద్వారా జాతీయ స్థాయిలో ప్రసిద్ధి .దానితో ఆమె ఇంటి పేరు అయిన అలరామరడ బదులు సాలుమరద తిమ్మక్క అని పిలవడం ప్రారంభించారు.

పురస్కారాలు

ఈమె పర్యావరణానికి చేసిన కృషికి గుర్తింపుగా ప్రభుత్వం భారత జాతీయ పౌర పురస్కారంతో తిమ్మక్కను గౌరవించింది.తిమ్మక్క అందుకున్న పలు అవార్డ్ లు

పద్మ శ్రీ – 2019
నేషనల్ సిటిజెన్ పురస్కారం – 1995
కర్ణాటక కల్పవల్లి అవార్డు – 2000
గాడ్ఫ్రే ఫిలిప్స్ ధైర్య అవార్డు – 2006
హంపి యూనివర్శిటీ నయాజయ్య అవార్డు – 2010
2016 లో బీబీసీ యొక్క 100 మంది శక్తివంతమైన మహిళలో ఒకరు.
ఇంకా మరెన్నో అవార్డులు

అమెరికాలోని లాస్ ఏంజెలాస్ , ఓక్లాండ్, కాలిఫోర్నియా లలో స్థాపించిన పర్యావరణ సంస్థలకు ఆమె పేరు మీద తిమ్మక్కాస్ రీసోర్సెస్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ (Thimmaka’s Resources for Environmental Education )
అని పేరు పెట్టడం విశేషం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube