ఆరేళ్ల కొడుకును అతి దారుణంగా.. ఓ తల్లి ఘాతుకం.. ?

అమ్మ అనే పదానికే మాయని మచ్చలా మిగులుతున్నారు కొందరు ఆడవారు.అసలు అమ్మ అని పిలిపించుకోవాలని తపిస్తున్న వారెందరో ఉన్న ఈ లోకంలో అమ్మగా మారాక ఆ పిలుపును చేతులారా నాశనం చేసుకుంటున్న మహిళలను చూస్తుంటే మతి భ్రమించి చేస్తున్న పనులా ఇవి అని అనుమానం వస్తుంది.
ఇక ఆడదాని మనస్సు అంతుచిక్కని అగాధం అంటారు కవులు.కానీ కొంచెం ప్రేమ కురిపిస్తే ఆ మనస్సు కరుగుతుందని పదాలు అల్లుతారు.కొన్ని కొన్ని సంఘటనలు చూస్తే ఈ పదాలన్ని అబద్దాలు అనిపిస్తుంది.ఎందుకంటే కన్నబిడ్దలనే చంపుకుంటున్న తల్లులను చూస్తుంటే.

 Mother Murdered Her-TeluguStop.com

ఇకపోతే ఓ తల్లి తన 6 ఏళ్ల కొడుకు గొంతు కోసి హత్య చేసిన ఘటన వెలుగు చూసింది.కేరళ రాష్ట్రంలో జరిగిన ఈ ఘాతుకం గురించి తెలుసుకుంటే.

పాలక్కాడ్‌లోని పూలక్కాడ్‌ గ్రామంలో నివసిస్తున్న షాహిదా తన మూడో కొడుకును ఇంట్లోని బాత్రుమ్ లో హత్య చేసిందట.

 Mother Murdered Her-ఆరేళ్ల కొడుకును అతి దారుణంగా.. ఓ తల్లి ఘాతుకం.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ఆ తర్వాత తనే పోలీసులకు సమాచారం ఇచ్చిందట.

ఇక హూటాహుటిన ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతుదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.ఈ ఘటనలో షాహిదను అరెస్ట్ చేసిన పోలీసులు ఆమె మానసికస్థితిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారట.

#Kerala #Mother Murdered #Palakkad #MotherKilled

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు