పిల్లల 'టీవీ' పాఠాల కోసం ఆ తల్లి చేసిన పని చూస్తే?

తల్లి అంటేనే త్యాగం.పిల్లల ఆనందం కోసం తనకు కావాల్సినవి కూడా త్యాగం చేస్తుంది.

 Mother Mortgages, Mangalsutra, Tv Set,  Children, Tv Classes, Karnataka,mother M-TeluguStop.com

చదువుల కోసం, మంచి తిండి కోసం, మంచి బట్టల కోసం తను కష్టపడుతూ పిల్లలను ఆనందంగా చూసుకుంటుంది.ఇంకా అలానే పిల్లల టీవీ పాఠాల కోసం ఓ తల్లి ఏకంగా తాళిని తాకట్టు పెట్టి వార్తలుకెక్కింది ఆ మాతృమూర్తి.

కరోనా వైరస్ కారణంగా పిల్లల చదువు టీవీకెక్కింది.పిల్లలు అందరూ ఆన్‌లైన్ పాఠాలు వింటున్నారు.

కొందరు టీవీలలో, మరికొందరు స్మార్ట్ ఫోన్ లో, మరికొందరు కంప్యూటర్లలో ఆన్లైన్ పాఠాలు వింటున్నారు.ఈ నేపథ్యంలోనే టీవీ ద్వారా పిల్లలకు పాఠాలు చెప్పించనున్నట్లు కర్ణాటక ప్రభుత్వం ప్రకటించింది.

అయితే పేదల ఇళ్లలో టీవీలు, సెల్ ఫోన్లు లేవు.దీంతో కర్ణాటకలోని గ‌డ‌గ్‌కు చెందిన ఓ మహిళ తన పిల్లల చదువు కోసం ఆమె మంగ‌ళ‌ సూత్రాన్ని తాకట్టు పెట్టి టీవీ కొనుగోలు చేశారు.

ఆమె పేరు కస్తూరి.ఈ విషయంపై ఆమె మాట్లాడుతూ.”టీవీ చూడటం కోసం తన పిల్లలు తరచూ పక్కింటికి వెళ్లేవారని ఇంకా పాఠాలు వినడం కోసం పక్కింటికి పంపించలేక పిల్లలకోసం తాళిని తాకట్టు పెట్టి టీవీ కొన్నాం” అని ఆమె తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube