వైరల్ వీడియో: మేరీ మాత కంట కారిన రక్తం… ఆలా కారడం దేనికి సంకేతం…!?  

Mother Mary statue cries blood tears,Mother Mary, italy, blood, eyes, statue, idol, social media, trending, viral - Telugu Blood, Eyes, Idol, Italy, Mother Mary, Mother Mary Statue Cries Blood Tears, Social Media, Statue, Trending, Viral

ఇటలీ దేశం లోని కార్మియానో పట్టణంలో ఓ వింత సంఘటన చోటు చేసుకుంది.పట్టణంలో ఉన్న మేరీ మాత విగ్రహం కంటి నుండి రక్తం కన్నీరు లాగా కారింది.

 Mother Mary Statue Cries Blood Tears

అలా విగ్రహం నుండి కన్నీళ్ళు కారుతున్నాయన్న విషయాన్ని ఓ చిన్నారి గమనించి దానిని వారి పెద్దలకు చెప్పడంతో ఇప్పుడు ఆ విషయం కాస్త సంచలనం సృష్టిస్తోంది.దీంతో ఈ విషయం నగరంలోని ప్రజలకు తెలియడంతో పెద్ద సంఖ్యలో విగ్రహం దగ్గరకు చేరుకుంటున్నారు.

ఈ విగ్రహం విషయానికి వస్తే 1943 సంవత్సరంలో దీనిని అక్కడ ఏర్పాటు చేశారు.అయితే తాజాగా ఈ సంఘటన ఆశ్చర్యానికి కలగజేసింది.విగ్రహం కుడి కంటి నుండి మాత్రమే రక్తం లాంటి ద్రవం రావడంతో అందుకు ఏదైనా సంకేతమో అన్నట్లుగా భావిస్తున్నారు.ప్రపంచంలో ఏదైనా చెడు జరగబోతోందో.? లేకపోతే ఏదైనా ప్రళయం రాబోతుందా.? ప్రస్తుతం కరోనా కారణంగా ప్రజలు చనిపోతుందున చూసి మేరీమాత ఇలా రక్త కన్నీరు పెడుతుందని రకరకాల విషయాలపై ప్రజలు చర్చించుకుంటున్నారు.

వైరల్ వీడియో: మేరీ మాత కంట కారిన రక్తం… ఆలా కారడం దేనికి సంకేతం…-General-Telugu-Telugu Tollywood Photo Image

దీంతో ఈ విగ్రహం సంబంధించి ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేయడంతో అవి కాస్తా వైరల్ గా మారాయి.నిజానికి ఆ మేరీ మాత విగ్రహం ఉన్నచోట ప్రజలు గుంపులు గుంపులుగా ఎప్పుడూ ఉండేవారు కాదు.

అయితే ఈ సంఘటన ఎప్పుడైతే గుర్తించారో ఇక అప్పటి నుండి వందల మంది అక్కడికి వచ్చి విగ్రహాన్ని చూస్తున్నారు.విగ్రహం నుండి వస్తున్న రక్తధారలు చూసి ప్రజలు అయ్యో అనుకుంటూ బాధపడుతున్నారు.

ఈ సంఘటనపై అక్కడ చర్చి దర్యాప్తు జరపనుందని లెస్సీ బిషప్ ప్రకటించినట్లు స్థానిక వార్తాపత్రిక ప్రచురించింది.

#Mother Mary #Trending #Viral #Eyes #Statue

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Mother Mary Statue Cries Blood Tears Related Telugu News,Photos/Pics,Images..