దారుణం : తల్లి ప్రేమకు దూరం అయిన గ్రామాలు, కన్నీరు పెట్టించే పిల్లల కథనాలు

ప్రపంచంలో అద్బుతమైనది తల్లి ప్రేమ.తల్లి ప్రేమ ఎంతటి కఠినాత్ములను అయినా మంచిగా మార్చుతుందనేందుకు ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి.

 Mother Less Villages In Indonesia-TeluguStop.com

పిల్లలు పుట్టినప్పటి నుండి కనీసం 15 ఏళ్ల వయసు వచ్చే వరకు ఖచ్చితంగా తల్లి ప్రేమ పొందాలి.అలా పొందినప్పుడే పిల్లలో మూత్రిమత్వం అనేది పెంపొందుతుంది.

పిల్లల్లో ఆలోచన దోరణి మరియు వారి జీవన శైలి అనేది తల్లి ప్రేమను బట్టి ఉంటుందని నిపుణులు చెబుతుంటారు.అందుకే తల్లి ప్రేమ లేని పిల్లలు చాలా కఠినాత్ములుగా తయారు అవుతారని అంటారు.

ఒక్కరు తల్లి లేని వారు కనిపిస్తేనే అయ్యో పాపం అనిపిస్తుంది.అలాంటిది ఇండోనేషియా దేశంలోని పలు గ్రామాల్లో పిల్లలు తల్లులు లేకుండానే బతికేస్తున్నారు.

పిల్లలు తల్లి ప్రేమకు దూరంగా గడిపేస్తున్నారు.తూర్పు ఇండోనేషియాకు చెందిన గ్రామాలకు చెందిన మహిళలు బతుకుతెరువు కోసం దేశ విదేశాల్లో ఉద్యోగాల నిమిత్తం వెళ్తారు.కొన్ని గ్రామాల్లో మహిళలు అంతా కూడా వెళ్లి పోయారు.దాంతో వారి పిల్లలు పెద్ద వారి వద్ద ఉంటున్నారు.

కొందరు అయిదు ఆరు సంవత్సరాల పిల్లలను వదిలేసి వెళ్తారు.ఒకసారి వెళ్లిన వారు పదేళ్ల వరకు తిరిగి వచ్చే అవకాశం ఉండదు.

మళ్లీ మళ్లీ తిరిగి రాకుండా ఒకేసారి చాలా గ్యాప్‌ తీసుకు వస్తారు.

దారుణం : తల్లి ప్రేమకు దూరం అయ�

అలా కొన్ని వేల మంది పిల్లలు తల్లి ప్రేమ లేకుండా, కొందరు తండ్రులకు కూడా దూరంగా ఉంటూ పెద్దల వద్ద, వారి వారి తాత, బామ్మల వద్ద గడిపేస్తున్నారు.ఈ విషయం తాజాగా ప్రముఖ అంతర్జాతీయ మీడియా సంస్థ వెలుగులోకి తీసుకు వచ్చింది.వేలాది మంది పిల్లలు తల్లి ప్రేమకు దూరంగా ఉంటున్న నేపథ్యంలో ఆ గ్రామాలను తల్లి ప్రేమ లేని గ్రామాలు అంటున్నారు.

పదలు సంవత్సరాలు తల్లికి దూరంగా ఉంటున్న కొందరు పిల్లలు మీడియ ప్రతినిధి ప్రశ్నించిన సమయంలో కన్నీరు పెట్టుకున్నారు.అమ్మను చూడాలని ఉందన్నా కూడా ఆమె రాదు.కొన్ని వందల సార్లు అమ్మా నిన్ను చూడాలి ఒకసారి వస్తావా అంటూ అడిగినా అమ్మరాలేదని ఒక 13 ఏళ్ల బాలిక చెప్పుకొచ్చింది.అమ్మ ప్రేమకు నోచుకోలేక పోతున్న ఆ పిల్లలను చూస్తే జాలి వేస్తుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube