సూర్యాపేట్ జిల్లాలో దారుణం! పిల్లలకు విషమిచ్చి తల్లి!  

సూర్యాపేట జిల్లాలో లో తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి హత్య చేసిన తల్లి..

  • తెలంగాణలోని సూర్యాపేట జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. ఓ తల్లి తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తాను కూడా ఆత్మహత్య ప్రయత్నం చేసింది. ఈ సంఘటనలో చిన్నారులు ఇద్దరు మరణించగా తల్లి హాస్పిటల్ లో చికిత్స పొందుతోంది. ప్రస్తుతం ఆమె పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది.

  • వివరాల్లోకి వెళితే మేళ్లచెరువు మండలంలో వెల్లటూరు గ్రామానికి చెందిన మహిళ కుటుంబ కలహాల కారణంగా తీవ్ర మనస్తాపం చెంది ఆమె తన ఇద్దరు పిల్లలకు విషమిచ్చి తాను కూడా తీసుకున్నట్లు తెలుస్తుంది. అయితే వారి ముగ్గురిని అపస్మారక స్థితిలో చూసిన స్థానికులు వెంటనే సమీప ఆస్పత్రికి తరలించడం జరిగింది. కానీ అప్పటికే పిల్లలిద్దరూ చనిపోయినట్టు డాక్టర్లు నిర్ధారించారు. ఇక పోలీసులు సంఘటన గురించి తెలుసుకుని వెంటనే హాస్పిటల్ కి వెళ్లి కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.