సమాజంలో ఈ మధ్య జరుగుతున్న దారుణాలలో అక్రమ సంబంధాల వల్ల( Illegal Relationships ) జరిగే దారుణాలే చాలా ఎక్కువ.కేవలం కొద్ది క్షణాల శారీరక సుఖం కోసం కుటుంబాలను నాశనం చేసుకుంటున్నారు.
ప్రేమించిన ప్రియుల కోసం కడుపున పుట్టిన పిల్లలనే కాటికి పంపిచేస్తున్నారు.ఈ కోవలోనే ఓ మహిళ తన ప్రియుడి కోసం ఏకంగా కడుపున పుట్టిన కూతురిని హత్య చేసి, ప్రమాదవశాత్తు చనిపోయింది అని అందరినీ నమ్మించే ప్రయత్నం చేసి పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన ఘటన హైదరాబాద్లోని( Hyderabad ) కుషాయిగూడలో తాజాగా వెలుగులోకి వచ్చింది.
ఈ హత్య ఘటనకు సంబంధించిన వివరాలు ఏమిటో చూద్దాం.
వివరాల్లోకెళితే.
హైదరాబాద్ కుషాయిగూడ కు చెందిన కళ్యాణి ( Kalyani ) అనే యువతి రమేష్( Ramesh ) అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.వీరికి తన్విత అనే అమ్మాయి సంతానం.
అయితే కొన్ని మనస్పర్ధల వల్ల దంపతులు విడిపోయారు.కళ్యాణి తన కూతురుతో కలిసి కాప్రాలో నివాసం ఉంటుంది.
అయితే కళ్యాణికు ఇంస్టాగ్రామ్ ద్వారా జనగామ జిల్లాకు చెందిన నవీన్ ( Naveen ) అనే యువకుడు తో పరిచయం ఏర్పడింది.వీరి పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారి తీసింది.
భర్తతో విడాకులు మంజూరు కాకముందే నవీన్ తో కళ్యాణి వివాహేతర సంబంధం కొనసాగించింది.

కొద్ది రోజుల తర్వాత కళ్యాణి, నవీన్ ను పెళ్లి చేసుకోవాలని అడిగితే.బిడ్డ ఉంటే పెళ్లికి తమ పెద్దలు ఒప్పుకోరని నవీన్ తెలిపాడు.ఎలాగైనా నవీన్ ను పెళ్లి చేసుకోవాలి అనుకున్న కళ్యాణి తన నాలుగేళ్ల కూతురైన తన్వితను( Tanvita ) అడ్డు తొలగించుకోవాలి అనుకుంది.
ఈ క్రమంలోనే రెండు వారాల క్రితం స్కూల్ నుండి వచ్చిన పాప నిద్రిస్తూ ఉండగా దిండుతో ముఖంపై గట్టిగా ఒత్తి ఊపిరి ఆడనీయకుండా చేసి చంపేసింది.ఆ తర్వాత హాస్పటల్ కు తీసుకువెళ్లి నిద్రపోయి లేవటం లేదని తెలుపగా వైద్యులు చనిపోయినట్లు నిర్ధారించారు.

నిద్రలో తన కూతురు చనిపోయింది అని అందర్నీ నమ్మించే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది.భర్త రమేష్ కి కళ్యాణిపై అనుమానం రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.పోలీసులు కళ్యాణి ప్రవర్తనను పూర్తిగా గమనిస్తూ తమదైన శైలిలో విచారణ చేయగా నవీన్ అనే యువకుడిని పెళ్లి చేసుకోవడం కోసం తానే తన కూతురిని హత్య చేసినట్లు అంగీకరించడంతో పోలీసులు కళ్యాణి ను అదుపులోకి తీసుకున్నారు.







