విశాఖపట్నం గిరిజన తండాలో దారుణం! మేనకోడలిని నరికి రక్తం తాగిన మేనత్త!  

విశాఖపట్నం గిరిజన తండాలో మేనకోడలిని హత్య చేసిన మేనత్త.

మానవీయ బంధాలు ఎంత దారుణంగా కనుమరుగావుతున్నాయో ఈ మధ్య కాలంలో జరుగుతున్నా ఘటనలు రుజువు చేస్తున్నాయి. సొంత కుటుంబ సభ్యులే అవసరాల కోసం, స్వార్ధంతో, వివాహేతర సంబంధాలతో ఒకరిని ఒకరు చంపుకునే వరకు వస్తున్నారు. తాజాగా విశాఖపట్నం జిల్లాలో గిరిజన తండాలో ఇలాంటి సంఘటన ఒకటి జరిగింది. కుటుంబ కలహాలతో సొంత మేనకోడలిని మేనత్త దారుణంగా నరికి చంపింది. అంతటితో ఆగకుండా రక్తపు మరకలతో వీధిలో కుళాయి వద్దకు వెళ్ళింది.

విశాఖ జిల్లా గిరిజన తండా అయిన లాకేయపుట్టులో ఈ ఘటన జరిగింది. మేనకోడలిని హత్య చేసిన రాస్కో అనే మహిళా రక్తపు మరకలతో కుళాయి దగ్గరకి వెళ్ళడంతో ఆమె తీరు గమనించిన గ్రామస్తులు విషయం తెలుసుకొని రాస్కోని చెట్టుకి కట్టేసి కొట్టసాగారు. విషయం తెలుసుకొని సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మేనత్త రాస్కోని అదుపులోకి తీసుకున్నారు. ఆమె మేనకోడలిని చంపేసి రక్తం తాగిందనే అనుమానంతో గ్రామస్తులు ఆమెపై దాడి చేసినట్లు తెలుస్తుంది. ఈ సంఘటనకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియరావాల్సి వుంది.