అమ్మ పిలుపుకు మాయని మచ్చ.. కొడుకును హత్య చేసేందుకు సుఫారీ ఇచ్చిన తల్లి.. !

తమ ప్రాణాలు బలి ఇచ్చైన కడుపున పుట్టిన వారిని కాపాడుకునే తల్లిదండ్రుల గురించి విన్నాము.అక్కడక్కడ చూస్తున్నాము.

 Mother Gives Sufari To Kill Son-TeluguStop.com

కానీ ఈ మధ్య కాలంలో శరీర సుఖాల కోసం, విచ్చలవిడిగా ప్రవర్తిస్తూ, కుక్కల కంటే హీనంగా బ్రతుకుతున్న మనుషుల గురించి వింటేనే అసహ్యం వేస్తుంది.ఇక హద్దు మీరే ఆలోచనలు, మనుషులకు దొరికిన స్వేచ్చ వల్ల శరీరం తాపంతో రగిలిపోతుంటే కొందరు తాము మనుషులం, అందులో ఆడవాళ్లం అనే యావ కూడా ఉండకుండా సమాజంలోని కట్టుబాట్లను పాతరేస్తున్నారు.

ఇక ఒక తల్లి అమ్మ అనే పదానికే కళంకం తెచ్చిన సంఘటన అనంతపురం కదిరి నియోజకవర్గంలో జరిగింది.ఆ వివరాలు చూస్తే.

 Mother Gives Sufari To Kill Son-అమ్మ పిలుపుకు మాయని మచ్చ.. కొడుకును హత్య చేసేందుకు సుఫారీ ఇచ్చిన తల్లి.. -Breaking/Featured News Slide-Telugu Tollywood Photo Image-TeluguStop.com

తన అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్నాడని చిన్నా అనే యువకుడ్ని, కన్న తల్లి సుబ్బలక్ష్మి, ఒక లక్ష యాబైవేల రూపాయలు సుఫారీ ఇచ్చి మరీ హత్య చేయిందట.క్షణికమైన సుఖం కోసం నవ మాసాలు మోసిన బంధాలను కూడా పక్కన పెట్టి ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్న వారికి, కనీసం పొత్తిళ్లలో పెరిగిన జ్ఞాపకాలు కూడా గుర్తుకు రాకపోవడం చూస్తే మనిషి ఏ స్దాయికి దిగజారి పోతున్నాడో అర్ధం అవుతుంది.

ఇలాంటి మనస్తత్వాన్ని పెంచే అభివృద్ధి జరిగినా, జరగపోయిన ఒకటే.బంధాలే బరువనుకున్నప్పుడు ఈ భూమి మీద మనుషులే వ్యర్ధం.

#Mother #Kadiri #Anantapur

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube