వైరల్: తన బేబీకి పాఠాలు నేర్పుతున్న ఏనుగు... అలాకాదు, ఇలాఅంటూ!

తన పిల్ల ఏనుగుకి తల్లి ఏనుగు పాఠాలు నేర్పడం ఏమిటని ఆశ్చర్య పోతున్నారా? అందులో ఆశ్చర్యం ఏముంది చెప్పండి? ఈ భూమిపైనా జీవించే ప్రతి తల్లిదండ్రులు.తమ పిల్లలను పెంచే క్రమంలో ఎన్నో జాగ్రత్తలు వహిస్తారు.

 Mother Elephant Teaches Baby How To Cross Road, Elephant, Baby Elephant, Road Cr-TeluguStop.com

ప్రతి విషయాన్ని వారికి దగ్గరుండి నేర్పిస్తూ ఉంటారు.అయితే దీనికి జంతువులు మినహాయింపేమీ కాదు.

తాజాగా, సోషల్ మీడియాలో ఓ ఏనుగుకు సంబంధించిన వీడియో చూస్తే, మీకే అర్ధం అవుతుంది.ఆ ఏనుగు బాధ ఏమిటో.

అవును, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోని గమనిస్తే ఒక తల్లి ఏనుగు తన పిల్ల ఏనుగుకి రోడ్డు ఎలా క్రాస్ చేయాలో నేర్పిస్తూ ఉండటం విశేషంగా కనబడుతోంది.కాగా ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.ఈ వీడియోని IAS అధికారి సుప్రియ సాహు షేర్ చేశారు.ఈ వీడియోలో ఓ పెద్ద ఏనుగు తన పిల్ల ఏనుగుకి, అడవిలోకి ఎలా వెళ్లాలి? ఈ క్రమంలో రోడ్డుని క్రాస్ చేయాలి? అనే విషయాన్ని నేర్పిస్తూ కనిపిస్తోంది ఇక్కడ చూడండి.కాగా ఆ తల్లి ఏనుగు తెలివికి నెటిజన్లు ఇంప్రెస్ అయిపోతున్నారు.

దాంతో సదరు పోస్ట్‌ను ఒకరినుండి మరొకరికి షేర్ చేసుకుంటున్నారు.ఫలితంగా ఇప్పటికీ 54.6 వేల వ్యూస్ ఆ వీడియోకి వచ్చాయి.ఇక కామెంట్స్ గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.కామెంట్ల వర్షం కురుస్తోంది అని చెప్పుకోవచ్చు.అడవిలో జంతువులకు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ప్రజలు అటవీ ప్రాంతాలలో ఎలా జాగ్రత్తగా తమ వాహనాలను నడపాలి అనే అంశం మీద కొంతమంది కామెంట్లు చేస్తే, మరికొందరు కారు డ్రైవరు డ్రైవింగ్ సమయంలో సకాలంలో పాజ్ చేసి తల్లి, బిడ్డను రోడ్డు దాటడానికి అనుమతించారని ప్రశంసించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube