అమ్మకు విడాకులు అందుకే పేరు తీసేసా...నటి షాకింగ్ కామెంట్స్!

పవన్ కళ్యాణ్ రానా హీరోలుగా నటించిన చిత్రం భీమ్లా నాయక్.ఈ సినిమాలో రానాకు హీరోయిన్ గా నటించారు నటి సంయుక్త మీనన్.

 Mother Divorce Is Why The Name Was Removed Actress Shocking Comments,samyukta Me-TeluguStop.com

ఈ సినిమా అనంతరం ఈమె కళ్యాణ్ రామ్ హీరోగా నటించిన బింబిసారా సినిమాలో కూడా నటించారు.ప్రస్తుతం ధనుష్ హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సార్ సినిమాలో నటిస్తున్నారు.

ఈ సినిమా ఫిబ్రవరి 17వ తేదీ విడుదల కానుంది.ఈ క్రమంలోనే సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొని తన వ్యక్తిగత విషయాల గురించి తెలియజేశారు.

Telugu Bhimla Naik, Dhanush, Kalyan Ram, Bimbisara, Pawan Kalyan, Rana, Samyukta

ఈ సందర్భంగా సంయుక్త మీనన్ మాట్లాడుతూ… నేను స్కూలు జాయిన్ అయ్యేటప్పుడు ఇంటిపేరు రాయమని చెప్పారు.అప్పటివరకు మన పేరు పక్కన ఈ తోక ఏంటా అనుకునేదాన్ని.ఎప్పుడైతే సినిమాల్లోకి వచ్చానో నటిగా నా బాధ్యత తెలిసి వచ్చింది.మీనన్ అనే పదం నా పేరు పక్కనే ఉండడం సబబు కాదని అనిపించింది.ఎప్పుడైతే నేను సమానత్వం మానవత్వం ప్రేమ అన్నింటిని కోరుకుంటున్నాను అప్పుడు తనకు తన ఇంటిపేరు అడ్డు వచ్చిందని తెలిపారు.

Telugu Bhimla Naik, Dhanush, Kalyan Ram, Bimbisara, Pawan Kalyan, Rana, Samyukta

ఇకపోతే తన తల్లిదండ్రులకు కూడా విడాకులు తీసుకున్నారు ఇలా అమ్మకు విడాకులు రావడంతో అమ్మ తన తండ్రి ఇంటి పేరును కొనసాగించకూడదని కోరుకుంది అందుకే నేను కూడా నా పేరు పక్కన తోకను కత్తిరించి అమ్మ నిర్ణయాన్ని గౌరవించాలని అనుకున్నాను అంటూ ఈ సందర్భంగా సంయుక్త తన తల్లిదండ్రుల విడాకుల గురించి తన ఇంటిపేరు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ప్రస్తుతం ఈమె చేసినటువంటి ఈ కామెంట్స్ అవుతున్నాయి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube