అమ్మ అన్నం పెట్టలేదని.. దారుణంగా హత్య!

మనిషి మొదటగా జన్మించాక మాట్లాడే మొదటి మాట అమ్మ.ఈ ప్రపంచంలో స్వార్థం లేని స్వచ్ఛమైన ప్రేమ ఏదైనా ఉంది అంటే అది ఒక అమ్మ ప్రేమ మాత్రమే.అమ్మంటే అందమైన అనుబంధం అంతులేని అనురాగం.అంత మంచి మనసు ఉన్న అమ్మ నవమాసాలు మోసి, కని,పెంచి పెద్దవారిని చేస్తుంది.మనం ఎదుగుతూ ఉన్నప్పుడు సంతోషించే వ్యక్తి ఉన్నారు అంటే అది ఒక కేవలం అమ్మ మాత్రమే.

 Mother Didinot Give Food To Son, Son Murdered Her, Aged Mother, Drunk,-TeluguStop.com

ఇంత ప్రేమానురాగాలు పెంచి పెద్ద చేసిన అమ్మకు ముసలి వయసు వచ్చేసరికి మనము వారిని చిన్న పిల్లల్లా చూసుకోవాలి.

కానీ ఇప్పుడు మాత్రం తల్లిదండ్రులు ముసలి వయసు వచ్చేసరికి పట్టించుకోవడం మానేశారు.కొంతమంది అయితే వారికి సరిగ్గా అన్నం కూడా పెట్టడం లేదు.అన్నం పెట్టలేదని కన్నతల్లినే చంపిన కిరాతకుడు.దీని గురించి తెలుసుకుందాం.

ఆ ముసలి తల్లిది 93 ఏళ్ల వయసు.ఆ వయసులో తోడుగా ఉండాల్సిన కొడుకు కన్న తల్లి పట్ల కాలయముడయ్యాడు.నవమాసాలు కని పెంచిన తల్లి మీద చేయి చేసుకున్నాడు.కొడుకు కొట్టిన దెబ్బలకి తట్టుకోలేక విలవిలలాడుతూ ప్రాణాలు విడిచింది.

ఇక విషయంలోకి వెళితే యాదాద్రి భువనగిరి జిల్లా, బీబీనగర్ మండలం గొల్లగూడానికి చెందిన బాతుక ధనమ్మ కు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్నారు.

ఇద్దరికీ వివాహాలు జరిగాయి.

అయితే ధనమ్మ భర్త 20 ఏళ్ల క్రితం చనిపోయాడు.ఆమె కోడలు కూడా ప్రమాదవశాత్తు ట్రాక్టర్ ప్రమాదంలో చనిపోయింది.

అయితే అప్పటి నుంచి తన కొడుకు మల్లయ్య తల్లి దగ్గరే ఉన్నాడు.ఈ నెల 20న మల్లయ్య ఇంటికి తాగి వచ్చాడు.

అందుకు ధనమ్మ మల్లయ్యకు అన్నం పెట్టలేదు.ఈ విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది.

అప్పుడు మల్లయ్య అతని తల్లిని చేతితో ఛాతిపై గట్టిగా కొట్టాడు.దీనితో సృహ కోల్పోయిన ధనమ్మను ఇరుగు పొరుగు వారి సహాయంతో ఆస్పత్రికి తరలించారు.

అనంతరం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం ధనమ్మ మరణించింది.దనమ్మ కూతురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మల్లయ్య పై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube