తల్లిని రోడ్డు మీదకి గెంటేసిన హీరోయిన్ సంగీత  

తల్లిని ఇంటి నుంచి గెంటేసిన మాజీ హీరోయిన్. .

Mother Complaint On Ex Heroine-heroine Sangeetha,kollywood,mother Complaint,tollywood

హీరోయిన్ గా సౌత్ సినిమాలలో తనదైన ముద్ర వేసిన నటి సంగీత. ఇక ఈ భామ పెళ్లి చేసుకొని సినిమాలకి ప్రస్తుతం గ్యాప్ ఇచ్చింది. అయితే ఇప్పుడు ఊహించని విధంగా ఈ భామ మళ్ళీ వార్తల్లోకి వచ్చింది..

తల్లిని రోడ్డు మీదకి గెంటేసిన హీరోయిన్ సంగీత-Mother Complaint On Ex Heroine

అయితే అది కూడా తల్లితో గొడవపడి, ఆమెని ఇంటి నుంచి బయటకి గెంటేసి మహిళా కమిషన్ చుట్టూ తిరుగుతుంది. అసలు విషయంలోకి వెళ్తే ప్రస్తుతం సంగీత తన భర్తతో కలిసి ఉన్న బిల్డింగ్ తన తల్లి కూడా ఉంది. అయితే అది తన సొంత ఆస్తి కావడంతో ఇన్ని రోజులు తల్లి, తమ్ముడుని ఉంచింది.

అయితే రీసెంట్ గా ఆమె తమ్ముడు చనిపోవడంతో తల్లి మాత్రమే ఒంటరిగా ఉంటుంది. అయితే తల్లి ఉండటంతో ఇప్పుడు ఆ ఆస్తి కోసం తన అన్నలు కూడా వచ్చే అవకాశం ఉందని తల్లిని ఎ మాత్రం కనికరం లేకుండా ఇంటి నుంచి బయటకి వెళ్ళిపోమని చెప్పినట్లు ఆమె తల్లి మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేసింది. దీంతో మహిళా కమిషన్ నుంచి నోటీసులు అందుకున్న సంగీత భర్తతో కలిసి విచారణకి హాజరవుతుంది.

అయితే ఆమె మీడియాతో మాట్లాడేందుకు ఇష్టపడటం లేదని తెలుస్తుంది.