అల్లుడిని పెళ్లాడిన అత్త.. కూతురుకు ఊహించని షాక్!

సాధారణంగా ఎక్కడైనా తల్లి పిల్లల క్షేమం కోరుతుంది.తను తిన్నా తినకపోయినా పిల్లలు తింటే చాలని… పిల్లల జీవితాలు బాగుంటే చాలని తల్లి భావిస్తుంది.

 Mother Cheated Daughter With Illegal Relation Ship, England, Mother , Son In Law-TeluguStop.com

కానీ ఒక తల్లి మాత్రం కూతురికి ఊహించని షాక్ ఇచ్చింది.తల్లి అల్లుడినే పెళ్లాడటంతో షాక్ అవ్వడం కూతురు వంతయింది.

సదరు తల్లి గురించి తెలిస్తే ఇలాంటి తల్లులు కూడా భూమిపై ఉంటారా అనే అనుమానం కలుగక మానదు.

పూర్తి వివరాల్లోకి వెళితే ఇంగ్లండ్ కు చెందిన లౌరెన్ పౌల్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది.లౌరెన్ పెళ్లికి ముందే ఒక బిడ్డకు జన్మనిచ్చింది.వివాహం అనంతరం హనీమూన్ కోసం వెళ్లిన జంట బిడ్డను చూసుకోవడం కోసం లౌరెన్ తల్లి జూలీని కూడా వెంట తీసుకెళ్లింది.

హనీమూన్ ట్రిప్ ముగిసిన తర్వాత లౌరెన్ తన భర్త గతంలోలా లేడని తన భర్త ప్రవర్తనలో ఏదో మార్పు వచ్చిందని గమనించింది.

అయితే ఒకరోజు లౌరెన్ చెల్లి తన తల్లి అల్లుడితో అసభ్యంగా చాట్ చేస్తున్నట్లు గుర్తించి ఆ విషయాన్ని అక్కకు తెలిపింది.ఆ విషయం తెలిసి షాక్ అవ్వడం లౌరెన్ వంతయింది.తన భర్త ఎక్కువ సమయం ఫోన్ లోనే గడిపేవాడని అయితే భర్త ఈ విధంగా నమ్మకద్రోహం చేస్తాడని తాను ఊహించలేదని లౌరెన్ పేర్కొంది.

అయితే తల్లి మాత్రం లౌరెన్ కు అల్లుడితో సంబంధం లేదని తనను అపార్థం చేసుకోవద్దని చెప్పింది.విషయం తెలిసిన పౌల్ ఇల్లు వదిలి వెళ్లిపోవడంతో లౌరెన్ పాల్ కు పుట్టిన బిడ్డ ఒంటరిదైంది.

ఆ తరువాత కొన్ని రోజులకు లౌరెన్ కు తన తల్లి జూలీ అల్లుడిని పెళ్లి చేసుకుందని బిడ్డకు జన్మనిచ్చిందని తేలింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube