అమ్మాయి తల్లితో ప్రపోజ్ చేద్దామనుకున్నాడు.. కానీ ఆమె ఎగిరి తన్నింది.. అప్పుడు చూడాలి మనోడి పరిస్థితి

ప్రస్తుత రోజుల్లో లవ్ అనేది ఫుల్ కామన్ అయిపోయింది.అబ్బాయి అమ్మాయి ప్రేమించుకున్నారంటే పెద్ద వాళ్లు కూడా తమ పంతాలను వదిలిపెట్టి వారి పెళ్లి చేసేందుకు చూస్తున్నారు.

 Mother Beats Young Man Who Proposed Her Daughter Infront Of Her Details, Mother-TeluguStop.com

కానీ ఒక్కో సందర్భంలో మాత్రమే ప్రేమించిన అమ్మాయిని వశం చేసుకునేందుకు అబ్బాయిలు తెగ కష్టపడాల్సి వస్తుంటుంది.ఎన్నో కష్టాలు పడితే కానీ మనసుకు నచ్చిన అమ్మాయిని మనువాడడం కష్టమైపోతుంది.

ఇటువంటి తరుణంలో అమ్మాయిలకు లవ్ ప్రపోజ్ చేసి వారి చుట్టూ చెప్పులరిగేలా తిరగడం కంటే వారి తల్లులకు విషయం చెబితే చాలా ఈజీగా మ్యాటర్ సెటిల్ అవుతుందని, ఒక వేళ సెటిల్ కాకపోయినా ఏదో ఒకటి త్వరగా తెలుస్తుందని చాలా మంది అనుకుంటున్నారు.

అందుకోసమే అమ్మాయిల తల్లులకు విషయం చెప్పేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.

అలానే ఓ యువకుడు కూడా అచ్చంగా వాళ్ల అమ్మతోనే లవ్ ప్రపోజ్ విషయం గురించి మాట్లాడేందుకు వెళ్లాడు.కానీ మనోడు అక్కడికి వెళ్లిన తర్వాత అక్కడ జరిగిన సీన్ చూస్తే ఎవరికైనా సరే కళ్లు బైర్లు కమ్ముతాయి.

అలా ఆ పిల్ల తల్లి మనోడితో చెడుగుడు ఆడుకుంది.ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఓ యువకుడు అమ్మాయి, తన తల్లి కలిసి ఉన్న వద్దకు వెళ్లి అమ్మాయి తల్లితో నేను మీ అమ్మాయిని లవ్ చేస్తున్నాని చెబుతాడు.కానీ అక్కడే ఉంది అసలు ట్విస్ట్.

అమ్మాయి తల్లి కరాటే బ్లాక్ బెల్ట్.ఆ విషయం మనోడికి ఎరక్కపోయి బాగా ఇరుక్కుంటాడు.దీంతో కోపోద్రిక్తురాలైన ఆ అమ్మాయి తల్లి మనోడి చాతిలో ఒక్కటి తంతుంది.అయినా కానీ మనోడు అక్కడి నుంచి వెళ్లకుండా పట్టువదలని విక్రమార్కుడిలా ఇంకా ఆ అమ్మాయి తల్లికి వివరిస్తూ ఉంటాడు.

ఇక సహనం కోల్పోయిన ఆ వ్యక్తి మనోడికి బ్రూస్ లీ పంచెస్ ఇస్తూ ఉంటుంది.అయినా కానీ మనోడు ఆమెను ప్రాధేయపడడం మానడు.కానీ చివరికి ఓ వైరల్ విషయాన్ని మనోడు ఆ తల్లికూతుళ్లకి చెబుతాడు.అది విన్న వారి మైండ్ ఒక్క సారి స్టన్ అవుతుంది.

అదంతా తాను ప్రాంక్ కోసం చేశానని చెబుతాడు.వీడియో తీస్తున్న తన టీమ్ ను కూడా చూపిస్తాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube