జబ్బు తగ్గడం లేదని తల్లి,కొడుకు ఆత్మహత్య...శ్రీశైలం లో!  

Mother And Son Committed Suicide In Srisailam-cancer Patient,mother And Son,suicide In Srisailam,కొడుకు ఆత్మహత్య,తల్లి

‘క్యాన్సర్’ దీని గురించి చెప్పాలి అంటే ఇటీవల చాలా మంది ఈ జబ్బు తో బాధపడుతున్నారు. ఒకప్పుడు దీనికి మందే లేదు అనే వారు కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు మారాయి. కేన్సర్ కు మందు ఉందని దానిని క్యూర్ చెయ్యొచ్చని ఏంతో మంది వైద్యులు చెబుతున్నారు. అయితే ఈ కేన్సర్ లో కూడా నాలుగు స్టేజ్ లు ఉంటాయి..

జబ్బు తగ్గడం లేదని తల్లి,కొడుకు ఆత్మహత్య...శ్రీశైలం లో! -Mother And Son Committed Suicide In Srisailam

నాలుగో స్టేజ్ కి క్యాన్సర్ చేరుకుంది అంటే అది ఇక కష్టం అని డాక్టర్స్ కూడా చెబుతుంటారు. అయితే ఈ క్యాన్సర్ ని జయించాలి అంటే చాలా గుండె ధైర్యం ఉండాలి. ఒకవేళ మనం కొంచం ధైర్యం కోల్పోయినా ఆ జబ్బు మన ప్రాణాలను తీసేస్తుంది.

అయితే ఈ భయం కారణంగానే ఒక మహిళ తన కొడుకు తో సహా ఆత్మహత్య చేస్తుకున్న ఘటన శ్రీశైలం లో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గత రెండ్లు గా క్యాన్సర్ తో బాధపడుతున్న సూర్యాపేటకు చెందిన మాధవి(34) అనే మహిళ, కొడుకు కార్తీక్(18) తో కలిసి ఆరు రోజుల క్రితంశ్రీశైలం క్షేత్రానికి వెళ్ళింది. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్న వీరిద్దరూ సాక్షి గణపతి ఆలయం సమీపంలో అడవుల్లోకి వెళ్లి వారి వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.అయితే ఈ విషయాన్ని ఆత్మహత్యకు ముందు వారి బంధులకు ఫోన్ చేసి చెప్పడం తో బంధువుల ఫిర్యాదు తో పోలీసులు గాలించగారు.

దీనితో వారి మృత దేహాలు లభ్యమయ్యాయి అయితే వారు చనిపోయి దాదాపు వారం కావడం తో వారి మృతదేహాలు కుళ్లిపోయినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.