18 మంది మహిళలను చంపిన కిరాతకుడు.. చివరకు ఇలా.. !  

rachakonda police, psycho ramulu, criminal, arrest - Telugu Arrest, Criminal, Psycho Ramulu, Rachakonda Police

ఒక మనిషి మానసిక స్దితి సరిగా లేకుంటే రాక్షసుడి కంటే ఘోరంగా ప్రవర్తిస్తాడని నిరూపించాడు ఈ కిల్లర్.అతని పేరే రాములు.

TeluguStop.com - Most Wanted Psycho Criminal Arrests

ఇతను ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా 18 మంది మహిళలను అతి దారుణంగా హతమార్చి సైకో కిల్లర్ గా పిలవబడుతున్నాడు.ఇక ఇతన్ని హైదరాబాద్ నార్త్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారట.

నేరం చేసిన వాడు ఏ రోజైనా శిక్ష అనుభవించక తప్పదని ఈ నేరగాడి అరెస్ట్‌తో నిరూపించబడింది.

ఇకపోతే సైకో రాములుకు కల్లు కాంపౌండ్లు, మద్యం దుకాణాలు, బహిరంగ ప్రదేశాల్లో ఉన్న ఒంటరి మహిళలనే టార్గెట్ చేస్తాడట‌.

ఇలా ఇప్పటివరకూ 18 మంది మహిళలను అతను హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు.

కాగా ఈ నెల మొదటి వారంలో హైదరాబాద్ శివారులోని అంకుషాపూర్ సమీపంలో మొదట ఓ మహిళ మృతదేహం పోలీసులకు లభ్యమైందట.

కానీ ఆమెకు సంబంధించిన వివరాలేమి దొరకలేదట.అయితే సంఘటనా స్థలంలో దొరికిన ఒకే ఒక్క చిన్న క్లూతో పలు సంచలన విషయాలు బయట పడ్డాయంటున్నారు పోలీసులు.

ఆ చీటిలో దొరికిన సెల్‌ఫోన్ నంబర్ ఆధారంగా పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టి ఈ కేసులో చివరికి పురోగతి సాధించారు.గతంలో రాములు మానసిక స్థితి సరిగా లేకపోవడంతో పోలీసులు ఆస్పత్రిలో చేర్పించినట్లు తెలుస్తోంది.

అక్కడి నుంచి తప్పించుకు పారిపోయిన రాములు ఎట్టకేలకు మళ్లీ పోలీసుల చేతికి చిక్కాడు.మరి ఈ సారైనా ఇతన్ని జాగ్రత్తగా కనిపెట్టుకుని శిక్షపడేలా చేస్తారా లేదా అని అనుకుంటున్నారట ఈ విషయం తెలిసిన వారు.

#Psycho Ramulu #Criminal #Arrest

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు