పిజ్జాను అలాంటి బాక్సులోనే ఎందుకు పెడతారు..ఈ లాజిక్ మీరు మిస్ అయ్యారా?

పిజ్జా అనగానే చాలా మందికి నోరు ఊరుతుంది.అసలు ఆ పేరు పలికితే చాలు వెంటనే తినేయాలి అని అనిపిస్తూ ఉంటుంది.

 Most Pizzas Are Round So Why Are Pizza Boxes Square Details, Pizza, Pizza Box, R-TeluguStop.com

మరీ ముఖ్యంగా యువత పిజ్జా అంటే చాలా ఇష్ట పడతారు.ఒకప్పుడు పిజ్జా అంటే పట్టణ ప్రాంతాల ప్రజలకు మాత్రమే తెలిసేది.

వారే తినేవారు.కానీ ఇప్పుడు అలా కాదు.

పల్లె టూరి వాళ్లకు కూడా పిజ్జా అంటే ఏంటో తెలుస్తుంది.

అలాగే చిన్న చిన్న టౌన్ లలో కూడా పిజ్జా లను అమ్ముతున్నారు.

జనం కూడా అంతే ఇష్టంగా తింటున్నారు.వీటి అమ్మకాలు గత 10 సంవత్సరాలుగా జోరందు కున్నాయి.

పిజ్జాలు ఎలాంటి షేప్ లో ఉంటాయో అందరికి తెలుసు.వీటి గురించి, వీటి షేప్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

పిజ్జాలు గుండ్రంగా ఉంటాయి అనేది విదితమే.అయితే పిజ్జాలు గుండ్రంగా ఉన్నప్పటికీ వాటిని చతురస్రాకారం లో ఉండే బాక్సుల్లో పెడతారు.

వీటి గురించి ఎవరైనా ఆలోచించారా.గుండ్రంగా ఉండే పిజ్జాలను చతురస్రాకారం లో ఉండే బాక్సుల్లో ఎందుకు పెడతారు అనే లాజిక్ మీకు తెలుసా.! దీని వెనుక ఒక రీజన్ ఉందట.

Telugu Logic, Pizzasboxes, Box, Pizzas, Pizzas Shape, Squar Boxes, Telugu-Latest

అట్టతో తయారు చేసిన పిజ్జా బాక్సులను గుండ్రంగా తయారు చేయడం కష్టంతో కూడుకున్న పని కాబట్టి అట్ట ముక్కలను చతురస్రాకారం లో తయారు చేయడం సులభం.అంతేకాదు గుండ్రంగా అట్టముక్కలతో బాక్స్ చేయాలంటే ఖర్చు ఎక్కువ అవుతుంది.

Telugu Logic, Pizzasboxes, Box, Pizzas, Pizzas Shape, Squar Boxes, Telugu-Latest

ఈ కారణంతోనే పిజ్జా బాక్సులను చతురస్రాకారం లో ఉండేలా తయారు చేస్తారు.మరొక కారణం కూడా ఉంది.గుండ్రంగా ఉండే బాక్సులను స్టోర్ చేయడానికి ఎక్కువ స్థలం పడుతుంది.

పిజ్జా బాక్సులను అలా డిజైన్ చేయడానికి దీనిని కూడా ఒక కారణంగా చెప్తారు.అలాగే ఒవేన్ కూడా చతురస్రాకారం లోనే ఉంటుంది కాబట్టి ఆ ఆకారంలో ఉన్న బాక్సులను వాటిలో ఉంచడానికి వీలుగా ఉంటుందని కూడా అలా తయారు చేస్తారట.

అలాగే పిజ్జాను చతురస్రాకారంలో తయారు చేయవచ్చు కదా అనే డౌట్ కూడా కొందరికి వస్తుంది.పిండిని చతురస్రాకారం లో తయారు చేయడం కష్టం కాబట్టి గుండ్రంగానే తయారు చేస్తారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube