భూమ్మీద ఎక్కువ మెరుపులు ఇక్క‌డే.. కార‌ణం ఏంటంటే..?

నీలాకాశంలో సడెన్ గా ఒక మెరుపు మెరిసిందంటే చాలు సంబుర పడిపోతాం.ఇలా ఎక్కువగా మెరుపులు వస్తే కాస్త భయానికి లోనైనా కూడా ఆనందంగా ఉంటాం.

 Most Of The Lightning On Earth Is Here What Is The Reason , Sky, Strange Mistory-TeluguStop.com

ఇలా మనకు ఎప్పుడో ఒకసారే సంవత్సరానికి ఒకసారో లేక రెండుసార్లో ఇలా మెరుపులు మెరుస్తాయి.మహా అయితే వర్షాకాలంలో కాస్తంత ఎక్కువ రోజులు మెరుపులు కనబడతాయి.

కానీ ఈ భూ ప్రపంచం మీద ఏకంగా 24 గంటల పాటు మెరుపులు మెరిసే ప్రాంతాలు కూడా ఉన్నాయంటే నమ్ముతారా.అవును ప్రపంచంలో కేవలం దక్షిణ అమెరికాలోని వెనిజులాలో 24 గంటల పాటు మెరుపులు మెరిసే ప్రాంతాలు ఉన్నాయి.

24 గంటల పాటు మెరుపులు మెరువడానికి గల కారణాలు ఏంటా అని ఎంత మంది శాస్త్రవేత్తలు ఎన్ని విధాలుగా పరిశోధనలు చేసినా.కూడా ఈ రహస్యాన్ని కనుగొన లేకపోయారు.

ఎన్నో ఏళ్ల నుంచి ఈ ప్రాంతంలో ఇలా మెరుపులు ఎందుకు మెరుస్తున్నాయనే దానికి గల కారణాలు మాత్రం వెలికితీయ లేకపోతున్నారు శాస్త్రవేత్తలు.వెనిజులాలో ఉన్న కాటటంబో న‌దీ ప్రాంతంలో ఇలా రోజులో 24 గంటల పాటు మెరుపులు వస్తాయి.

ఇలా మెరిసే మెరుపులు చాలా శక్తిమంతంగా ఉంటాయట.

Telugu Catatambo River, Earth, America, Strange Mistory, Venezuela-Latest News -

ఎంతలా అంటే మనం 400 కిలోమీట‌ర్ల ఆవల ఉండి కూడా ఈ మెరుపులను స్పష్టంగా చూసేలా.సాధారణంగా ఆకాశంలో ఒకే ప్లేస్ లో రెండుసార్లు మెరుపులు కనబడవు.కానీ ఈ నది మీద మాత్రం కేవలం గంటల వ్యవధిలోనే వేలసార్లు మెరుపులు క‌నిపిస్తాయి.

ఈ రహస్యాన్ని బీకన్ ఆఫ్ మరకైబో అని పిలుస్తారు.అంటారు.

అంతే కాకుండా ఈ మెరుపులను కాటటంబో మెరుపులు ఎవర్లాస్టింగ్ స్టార్మ్ అని కూడా పిలుస్తారు.ఈ నదిలో ఏడాదికి సుమారు 260 సార్లు తుఫాన్లు వ‌స్తాయని ఓ నివేదికలో తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube