టిక్ టాక్ ని భారతీయుల మోజు తగ్గేలా లేదుగా!  

టిక్ టాక్ యాప్ కోసం గూగుల్ లో విపరీతంగా వెతికేసిన ఇండియన్స్. .

Most Of The Indians Searching In Google For Tiktok App-most Of The Indians Searching,social Media,tiktok App,tiktok Ban

చెన్నై హై కోర్ట్ ఆదేశాల మేరకు కేంద్ర ఐటీ శాఖ టిక్ టాక్ యాప్ ని నిషేధించాలని గూగుల్, యాపిల్ కంపెనీలకి లేఖ రాసారు. దీనిపై స్పందించిన కంపెనీలు టిక్ టాక్ యాప్ ని తమ ప్లే స్టోర్స్ ని తొలగించేసాయి. అయితే ఇంత వరకు భాగానే ఉంది..

టిక్ టాక్ ని భారతీయుల మోజు తగ్గేలా లేదుగా! -Most Of The Indians Searching In Google For TikTok App

కాని ఇండియన్ జనాలకి దేని మీద అయిన ఆసక్తి కలిగితే అంత వేగంగా వదులుకోవడానికి ఇష్టపడరు. ఈ విషయం చాలా సందర్భాలలో రుజువైంది. ఇప్పుడు మరో సారి టిక్ టాక్ యాప్ విషయంలో కూడా రుజువైంది.

ఇప్పుడు ఇండియన్ నెటిజన్లు టిక్ టాక్ యాప్‌ కోసం గూగుల్‌ సెర్చ్‌ ఇంజిన్‌లో తెగ వెతికేస్తున్నారు. టిక్‌ టాక్‌ను ఎలా డౌన్‌లోడ్‌ చేసుకోవాలి, బ్యాన్‌ చేసిన యాప్‌ను మళ్లీ ఎలా పొందాలి అంటూ నెటిజన్లు గూగల్ లో వెతుకులాట మొదలెట్టారు. గూగుల్‌ గ్రాఫ్‌లో నెటిజన్లు టిక్‌ టాక్‌ గురించి వెతికిన ఇంటరెస్ట్ గూగుల్ ట్రేండింగ్ లో టాప్ లో ఉండటం విశేషం.

అలాగే టిక్‌టాక్‌ ను ప్రభుత్వం నిషేధించిన విషయం నిజమ, కాదా, అని తెలుసుకోవడానికి కూడా యూజర్లు గూగుల్‌లో తెగ వెతికేసినట్లు తెలుస్తుంది.