ఉగ్రదాడిని నిరసనగా దేశవ్యాప్తంగా నిరసన! పాకిస్తాన్ కి వార్నింగ్!

పుల్వామా లో సిఆర్పీఎఫ్ పై జరిగిన ఉగ్రదాడికి నిరసనగా దేశ వ్యాప్తంగా నిరసనలు మిన్నంటుకున్నాయి.జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థ చేసిన ఆథ్మాహుతి దాడిలో మొత్తం 44 మంది సిఆర్పీఎఫ్ జవాన్లు మరించారు.

 Most Of The Indians Says Want Serious Action On Pakistan-TeluguStop.com

దేశ వ్యాప్తంగా వీరి మరణానికి నివాళి అరిపిస్తున్న ప్రజలు, మరో వైపు రోడ్ల మీదకి వచ్చి పాకిస్తాన్ కి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేస్తున్నారు.ఉగ్ర వాద చర్యకి తక్షణం ప్రతీకారం తీర్చుకోవాలని కేంద్రానికి సందేశాలు పంపుతున్నారు.

మరో వైపు కేంద్ర సర్కార్ కూడా ఈ ఉగ్ర చర్యలపై తీసుకోవాలని చర్యల గురించి చర్చించేందుకు క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసి, పాకిస్తాన్ ఎలాంటి యాక్షన్ తీసుకోవాలో అనే విషయాలపై చర్చించారు.ఇక మరణించిన జవాన్ కుటుంబ సభ్యులు కూడా, తమ కుమారుడు మరణించినందుకు బాధపడటం లేదని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్తాన్ కి సరైన సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు.


పాకిస్తాన్ లో వున్న ఉగ్రవాద సంస్థలపై తక్షణం చర్యలు తీసుకొని వారిని దేశంలో లేకుండా చేయాలని, లేదంటే సీరియస్ యాక్షన్ తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది.ఈ దాడిలో ప్రపంచ దేశాలన్నీ భారత్ కి అండగా నిలబడి పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంపై సీరియస్ అయ్యారు.

అంతర్జాతీయ మీడియా సైతం భారత్ జవాన్లపై జరిగిన ఉగ్రదాడిని ప్రముఖంగా ప్రస్తావించడం విశేషం.ఇప్పటికే టెర్రరిస్ట్ ల మీద ప్రతీకార చర్యల కోసం చూస్తున్న సిఆర్పీఎఫ్ జవాన్లు ప్రభుత్వ ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నారు.

మరి కేంద్ర ప్రభుత్వం ప్రతీకార చర్యలలో భాగంగా ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube