మళ్ళీ మోడీ కావాలి అంటున్న భారతీయులు! టైమ్స్ మ్యాగజైన్ సర్వే!  

మళ్ళీ మోడీనే ప్రధాని కావాలని కోరుకుంటున్న భారతీయులు. టైమ్స్ మ్యాగజైన్ తాజా సర్వేలో వెల్లడి. .

ప్రస్తుతం దేశ ప్రధాన మంత్రిగా ఐదు ఏళ్ల కాలాన్ని పూర్తి చేసుకొని మరల లోక్ సభ ఎన్నికలలో తన స్టామినాని తెలుసుకోవడానికి ప్రధాని నరేంద్ర మోడీ సిద్ధం అవుతున్నాడు. ఐదేళ్ళ కాలంలో ఆర్ధికపరమైన ఆరోపణలు తప్ప మోడీ గవర్నమెంట్ మీద పెద్దగా అవినీతి ఆరోపణలు లేవనే చెప్పాలి. నోట్ల రద్దు, జీఎస్టీ, రాఫెల్ యుద్ధ విమానాల విషయంలో విపక్షాలు, ప్రాంతీయ పార్టీలు మోడీని టార్గెట్ చేస్తూ విమర్శలు చేస్తున్నాయి. అయితే దేశ ప్రజలు మాత్రం వీటిలో అవినీతి జరగలేదనే విషయాన్ని నమ్ముతున్నారు. మోడీ తీసుకొచ్చిన ఆర్ధిక సంస్కరణలు దేశ భవిష్యత్తుకి ఎంతో మేలు చేస్తాయని ప్రజలు అర్ధం చేసుకున్నట్లు వున్నారు. విపక్షాలన్నీ కూడా విమర్శిస్తూ, మరో వైపు మీడియా కూడా మోడీని టార్గెట్ చేస్తూ బీజేపీ ప్రభుత్వం వైఫల్యాలు ఎత్తి చూపించే ప్రయత్నం చేస్తున్నారు.

ఇదిలా వుంటే 2019 ఎన్నికలు సమీపిస్తున్నాయి. ఈ నేపధ్యంలో జాతీయ మీడియా సంస్థలు ప్రజలలోకి వెళ్లి రాబోయే ఎన్నికలలో ఎ పార్టీ అధికారంలోకి వస్తుంది. అలాగే ప్రస్తుతం ప్రధాని రేస్ లో వున్న మోడీ, రాహుల్ గాంధీలలో ఉత్తమ నాయకుడు ఎవరు అనే విషయాలని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇప్పటికే చాలా మీడియా సంస్థలు రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ, మోడీ ప్రభుత్వంపై కొంత వ్యతిరేకత వున్నా మళ్ళీ ఆ పార్టీకే పట్టం కడతారని స్పష్టం చేసాయి. తాజాగా టైం మ్యాగజైన్ తన సర్వే రిలీజ్ చేసింది. ఈ సర్వేలో ఏకంగా 83 శాతం మంది ప్రజలు మరల మోడీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. ఇక కేవలం 9.25 శాతం మంది మాత్రమె రాహుల్ గాంధీ ప్రధాని కావాలని కోరుకుంటున్నారు. మొత్తానికి ఈ సర్వేతో మళ్ళీ మోడీ ప్రధాని మంత్రి పీఠం మీద కూర్చోబోతున్నాడు అనేది స్పష్టం అయ్యింది అని చెప్పాలి.