దరిద్రంతో కొట్టుమిట్టాడుతున్న అదృష్టం ఇలా కలిసి వచ్చింది... లక్‌ అంటే ఇతడిదే

ఒక తెలుగు సినిమాలో కమెడియన్‌ దురదృష్టంను నెత్తిన పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు.అలాంటి వ్యక్తి వద్దకు దేవత వచ్చి కోట్ల రూపాయల విలువ చేసే బంగారు ఆభరణాలు ఇచ్చేందుకు వస్తుంది.

 Most Lucky Person In Australia He Got Gold On Road 1-TeluguStop.com

అయితే అవి పిచ్చి నగలు అని, ఆమె డ్రామా ఆర్టిస్టు అంటూ తరిమి కొడతాడు.అతడి దురదృష్టం ఆ స్థాయిలో ఉందన్నట్లు.

దురదృష్టవంతులు కంటే ఈ భూమి మీద అదృష్టవంతులు తక్కువ మంది ఉంటారు.వారికి అవకాశం లభించిన సమయంలో సద్వినియోగం చేసుకుంటారు.

అదే అవకాశంను దురదృష్టవంతుడు వదిలేస్తాడు.తాజాగా ఒక వ్యక్తి తన పిల్లలతో కలిసి వాకింగ్‌ చేస్తున్న సమయంలో బంగారం దొరికింది.

అదృష్టం కొద్ది దాన్ని తీసుకున్నాడు.

దరిద్రంతో కొట్టుమిట్టాడుతున�

పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఆస్ట్రేలియాకు చెందిన ఒక వ్యక్తి తన ఇద్దరు పిల్లలు మరియు కుక్కను వెంట పెట్టుకుని వాకింగ్‌కు వెళ్లాడు.వాకింగ్‌ కు ఎంతో మంది వెళ్తూ ఉంటారు.అయితే ఈయన కూతురుకు మాత్రమే ఒక చిత్రమైన ఆకారంలో ఉన్న ఘన పదార్ధం కనిపించింది.

ఆ అమ్మాయి అందరి మాదిరిగా తనకు ఎందుకులే అనుకుంటే అందరిలాగే వారు కూడా దురదృష్టవంతులు అయ్యేవారు.కాని వారి అదృష్టంబాగుండి అదేంటో చూడాలని దగ్గరకు తీసుకున్నారు.

దరిద్రంతో కొట్టుమిట్టాడుతున�

కూతురు చూసిన ఆ ముద్దను మొదట ఏదో రాయి అనుకున్నాడు.కాని దాన్ని దగ్గర నుండి చూసిన ఆ వ్యక్తికి అది బంగారం ఏమో అనే అనుమానం వచ్చింది.అనుకున్నదే తడువుగా కాస్త రబ్‌ చేసి చూస్తే మెరుస్తోంది.దాంతో అది బంగారమే అనే క్లారిటీకి వచ్చాడు.దాన్ని బరువు వేయగం 1.25 ఫౌండ్ల బరువు ఉన్నట్లుగా గుర్తించాడు.దాన్ని మార్కెట్‌లో అమ్మగా 30 వేల డాలర్లు వచ్చాయి.దాంతో అతడి ఆర్థిక పరమైన ఇబ్బందులు అన్ని తొలగి పోయాయి.అదృష్టం కంటి ముందుకు వచ్చినప్పుడు దాన్ని గుర్తించిన వాడే నిజమైన లక్కీ మన్‌.అందుకే లక్‌ అంటే ఇతడిదే అని నెటిజన్స్‌ అతడికి శుభాకాంక్షలు చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube