ప్రతి మనిషికి ఫిట్ నెస్ గా ఉండటం చాలా ముఖ్యం.ఫిట్ గా ఉంటేనే ఎలాంటి అనారోగ్యాలు మన దరిచేరవు.
కానీ ఇప్పుడున్న ఉరుకుల పరుగుల జీవితంలో అందరికీ అది వీలు కావట్లేదు.కానీ కొందరు మాత్రం ఎన్ని పనులు ఉన్నా సరే ఫిట్‌నెస్‌పై దృష్టిసారిస్తున్నారు.
ఇందులో కొందరు జిమ్‌కి వెళ్లి వ్యాయామాలు చేస్తుంటే ఇంకొందరు మాత్రం ఇంట్లోనే తమకు తెలిసిన వాటిని చేసేస్తున్నారు.ఏదో ఒకటి చేసి ఫిట్ గా ఉండేందుకు అందరూ ప్రయత్నిస్తున్నారు.
అయితే మనుషులతో పాటు వారు పెంచుకుంటున్న కొన్ని పెట్ డాగ్స్ కూడా ఇలాగే చేసేస్తున్నాయి.
సిటీ వాసులు పొద్దున జాగింగ్ కు వెళ్లినా లేదంటే ఈవినింగ్ వెళ్లినా సరే వారి వెంట కుక్కలను వెంట పెట్టుకుని వెళ్లడాన్ని మనం చూస్తున్నాం.
వారితో పాటు అవి కూడా జాగింగ్లు చేసేస్తున్నాయి.అయితే ఇప్పుడు ఓ కుక్క తనను ఎవరూ పిలవకపోయినా సరే నేనేం తక్కువ కాదంటూ ఫిట్నెస్ కసరత్తులు చేస్తోంది.
అయితే దాని కసరత్తులు చూస్తే మాత్రం కడుపుబ్బా నవ్వుకుంటారు.ఇందుకు సంబంధించిన తాజా వీడియో సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతోంది.ఓ కుక్క యజమాని ఓ గోడ దగ్గర వ్యాయామం చేస్తూ ఉంటాడు.
అయితే అతనికి కాస్త వెనకాల నిల్చున్న ఆ కుక్క కూడా అతన్ని ఫాలో అయిపోతుంది.
నేనేమన్నా తక్కువ తిన్నానా అన్నట్టు అతను ఎలా చేస్తే అలా వ్యాయామాలు చేసేస్తుంది.అతను కిందుకు వంగితే సడెనట్ గా కిందకు వంగడం, లేస్తే పైకి లేవడం ఇలా ఏది చేస్తే అది క్షణాల్లో చేసేస్తుంది.
మొత్తం అతన్ని చూస్తూనే ఉంటుంది.పక్కకు కూడా తల తిప్పకుండా కుక్క చేస్తున్న వ్యాయామాలు విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి.దీన్ని చూసిన నెటిజన్లు ఈ కుక్క మామూలుది కాదంటూ కామెంట్లు పెడుతున్నారు.ఇంకొందరు బాడీ బిల్డర్ అంటూ సెటైర్లు వేస్తున్నారు.
.