సినీ పరిశ్రమలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ వీళ్లే....?

కళ్యాణమొచ్చినా కక్కొచ్చినా ఆగదని పెద్దలు చెబుతూ ఉంటారు.అయితే టాలీవుడ్ లోని కొందరు హీరోలకు మాత్రం కళ్యాణ ఘడియలు సమీపించడం లేదు.

 Most Eligible Bachelors In Film Industry, Heroes, Marriage, Prabhas, Salman Kapo-TeluguStop.com

క్యాలెండర్ లో సంవత్సరాలకు సంవత్సరాలు మారుతున్నా కొందరు హీరోలు మాత్రం పెళ్లి చేసుకోవడానికి ఆసక్తి చూపడం లేదు.తాము అభిమానించే హీరోలు పెళ్లిళ్లు చేసుకోకపోవడంతో అభిమానులు సైతం నిరాశకు గురి అవుతున్నారు.

Telugu Heroes, Prabhas, Ranbir Kapoor, Salman Kapoor, Sundeep Kishan-Movie

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ జాబితాలో ప్రభాస్ ముందువరసలో ఉన్నారు.ఇప్పటివరకు ఏ హీరో పెళ్లిపై రానన్ని పుకార్లు ప్రభాస్ పెళ్లిపై వచ్చాయి.టాలీవుడ్ కు చెందిన ఒక ప్రముఖ హీరోయిన్ ను ప్రభాస్ పెళ్లి చేసుకోబోతున్నాడంటూ గాసిప్స్ గుప్పుమన్నాయి.అయితే ఆ వార్తలేవీ నిజం కాలేదు.వరుస సినిమాలతో బిజీగా ఉన్న ప్రభాస్ పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడో చూడాల్సి ఉంది.

Telugu Heroes, Prabhas, Ranbir Kapoor, Salman Kapoor, Sundeep Kishan-Movie

మరో టాలీవుడ్ హీరో రామ్ కూడా పెళ్లి మాటే ఎత్తడం లేదు.తన కంటే లేట్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన కుర్ర హీరోలు సైతం పెళ్ళిళ్లు చేసుకుంటే రామ్ మాత్రం పప్పన్నం ఎప్పుడు పెడతాడో చెప్పడం లేదు.కెరీర్ పేరు చెప్పి పెళ్లిని వాయిదా వేస్తున్న రామ్ ఎప్పుడు పెళ్లి చేసుకుంటాడో చూడాల్సి ఉంది.

Telugu Heroes, Prabhas, Ranbir Kapoor, Salman Kapoor, Sundeep Kishan-Movie

బాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ జాబితాలో సల్మాన్ ఖాన్ పేరు ముందువరసలో ఉంటుంది.వయస్సు 50 దాటినా ఈ హీరో పెళ్లి అనే బంధం గురించి పట్టించుకోవడం లేదు.చాలామంది హీరోయిన్లతో ప్రేమ వ్యవహారాలు నడిపిన సల్మాన్ పెళ్లి పీటలెక్కుతాడో లేదో చూడాల్సి ఉంది.

Telugu Heroes, Prabhas, Ranbir Kapoor, Salman Kapoor, Sundeep Kishan-Movie

బాలీవుడ్ లో లవర్ బాయ్ ఇమేజ్ ను సొంతం చేసుకున్న రణబీర్ కపూర్ కూడా పలువురు హీరోయిన్లతో ప్రేమాయాణం నడిపినా పెళ్లి ఎప్పుడు చేసుకుంటాడో మాత్రం చెప్పడం లేదు.44 సంవత్సరాల బాలీవుడ్ హీరో రణదీప్ హూడా కుడా పెళ్లి మాటే ఎత్తడం లేదు.పలువురు హీరోయిన్లతో ప్రేమ వ్యవహారాలు నడిపిన ఈ హీరో పెళ్లి ఆలోచన మాత్రం లేదని చెబుతున్నాడు.

యశ్ చోప్రా కుమారుడు ఉదయ్ చోప్రా కూడా ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube