బ్యాచ్‌లర్ కూడా కాపీయేనట.. అందుకే ఆలస్యం!

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.ఇప్పటివరకు సాలిడ్ హిట్ అందుకోని ఈ అక్కినేని వారసుడు, బ్యాచ్‌లర్ చిత్రంతోనైనా అదిరిపోయే హిట్ అందుకుంటాడా అని వారు ఆతృతగా చూస్తున్నారు.

 Most Eligible Bachelor Story Is Copied, Most Eligible Bachelor, Akhil Akkineni,-TeluguStop.com

ఇక ఈ సినిమాను బొమ్మరిల్లు దర్శకుడు భాస్కర్ డైరెక్ట్ చేస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై బజ్ క్రియేట్ అయ్యింది.కాగా ఈ సినిమాతో ఎలాగైనా కమ్‌బ్యాక్ ఇవ్వాలని భాస్కర్ పట్టుదలగా ఉన్నాడు.

ఇక ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే మెజారిటీ శాతం పూర్తికాగా రిలీజ్‌కు రెడీ అవుతోంది.అయితే ఈ సినిమా కథ విషయంలో చిత్ర యూనిట్‌కు ఓ ఎదురుదెబ్బ తగిలినట్లు తెలుస్తోంది.

ఈ సినిమా కథ షాది ముబారక్ అనే సినిమా కథను పోలి ఉన్నట్లు చిత్ర యూనిట్ గమనించింది.దీంతో ఈ సినిమా కథను మార్చేందుకు వారు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పటికే కాపీ కంటెంట్ సినిమాలను ప్రేక్షకులు ఎలా ట్రోల్ చేస్తారో తెలిసిందేనని, అందుకే తమ సినిమాకు అలాంటి ఇబ్బంది ఏమీ ఉండకూడదనే కథలో కీలక మార్పులు చేసి, తిరిగి రీషూట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఏదేమైనా మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ రిలీజ్‌కు ఏదో ఒక అడ్డంకి ఎదురవుతుండటంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది.

మరి ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనేది మాత్రం ఇంకా సస్పెన్స్‌గా ఉండటంతో అక్కినేని అభిమానులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు.ఇక ఈ సినిమాలో అఖిల్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఈ సినిమా పోస్టర్స్, టీజర్, సాంగ్స్‌కు ఇప్పటికే మంచి రెస్పాన్స్ దక్కిన సంగతి తెలిసిందే.మరి ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ దక్కుతుందో తెలియాలంటే ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube