బ్యాచిలర్ కు సెకండ్‌ వీక్‌ ఆశించింది దక్కలేదట

అఖిల్‌ మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్ సినిమాకు వసూళ్లు మొదటి వారంలో దాదాపుగా 40 కోట్ల రూపాయలు నమోదు అయ్యాయి.అందులో 26 కోట్ల వరకు షేర్‌ ఉంది.

 Most Eligible Bachelor Movie Second Week Collections-TeluguStop.com

మొత్తంగా అఖిల్ బ్యాచిలర్ సినిమా రెండవ వారం కూడా కలుపుకుని 50 కోట్ల వరకు రాబట్టి 30 కోట్ల షేర్‌ ను నమోదు చేస్తుంది అంటూ అంతా భావించారు.కాని అనూహ్యంగా మరో కోటి కూడా షేర్‌ ను రాబట్టలేక బ్యాచిలర్ సినిమా చతిగిల పడింది.

అనూహ్యంగా బ్యాచిలర్‌ సినిమాకు రెండవ వారంలో వసూళ్లు పూర్తిగా డ్రాప్‌ అయ్యాయి.రెండవ వారంలో ఈ సినిమాకు పోటీ అన్నట్లుగా పెద్ద సినిమా లు ఏమీ రాలేదు.నాట్యం వచ్చినా కూడా జనాలు ఆ సినిమాను పట్టించుకోలేదు.అయినా కూడా బ్యాచిలర్ ను చూసిన వారే లేరు అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు.

 Most Eligible Bachelor Movie Second Week Collections-బ్యాచిలర్ కు సెకండ్‌ వీక్‌ ఆశించింది దక్కలేదట-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్ సినిమాకు సంబంధించినంత వరకు ఈ సినిమా వసూళ్లు 50 కోట్ల వరకు ఉంటాయి అంటూ అంతా భావించారు.కాని అనూహ్యంగా ప్లాన్ రివర్స్ అయ్యింది.

సినిమా కాస్త బాక్సాఫీస్‌ వద్ద రెండవ వారం ప్రభావం చూపించలేదు.ఈమద్య కాలంలో సినిమాలు రెండవ వారంలో వసూళ్లు దక్కించుకోవడం అంటే చాలా పెద్ద విషయంగా మారింది.

అఖిల్‌ సినిమా ఖచ్చితంగా ఓటీటీ లో రాదు అంటూ ఇప్పటికే ప్రకటన చేసినా కూడా ప్రేక్షకులు మాత్రం ఆ విషయాన్ని పట్టించుకోలేదు.

Telugu 50 Crore Rupees, Akhil, Akhil Most Eligible Bachelor, Akkineni Hero, Most Eligible Bachelor Movie Collections, Pooja Hegde, Tollywood-Movie

మొదటి వారంలో వచ్చిన వసూళ్లు మాత్రమే బాక్సాఫీస్ వద్ద వసూళ్లుగా నిలిచాయి.అంతకు మించి రాబట్టలేక పోయాయి.లాంగ్‌ రన్‌ లో ఈ సినిమా మొత్తంగా రూ.43 కోట్లు నమోదు చేసినట్లుగా చెబుతున్నారు.ప్రస్తుతం బాక్సాఫీస్‌ వద్ద రాణిస్తున్న సినిమా లు ఏమీ లేవు.

బ్యాచిలర్ ఉన్నా కూడా పట్టించుకోవడం లేదు.ఈ వారంలో విడుదల కాబోతున్న సినిమాలు చాలానే ఉన్నాయి.

మరి ఏది పై చేయి సాధిస్తుంది అనేది చూడాలి.

#Akhil #Akkineni #Crore Rupees #AkhilEligible #Pooja Hegde

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube