‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ రీ షూట్ తప్పదా …?  

Most Eligible Bachelor, Akhil Akkineni, Pooja Hegde, Bommarillu Bhaskar, Re Shoot, Most Eligible Bachelor Movie Re Shoot, Nagarjuna - Telugu Akhil Akkineni, Bommarillu Bhaskar, Most Eligible Bachelor, Most Eligible Bachelor Movie Re Shoot, Nagarjuna, Pooja Hegde, Re Shoot

బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ మూవీలో నటిస్తున్నారు అఖిల్.ఈ చిత్రంలో అఖిల్‌కి జోడీగా స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే నటిస్తున్నారు.

 Most Eligible Bachelor Movie Re Shoot Nagarjuna

ఈ చిత్రాన్ని గీతాఆర్ట్స్2 పిక్చర్స్ బ్యానర్‌పై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు.ఈ సినిమాకు గోపీ సుందర్ మ్యూజిక్ డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.

అయితే ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్, ఫస్ట్ లిరికల్ ‘మనసా మనసా’ అంటూ సిద్ శ్రీరామ్ ఆలపించిన సాంగ్ విశేష ఆదరణ పొందిన విషయం తెలిసిందే.

మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ రీ షూట్ తప్పదా …-Movie-Telugu Tollywood Photo Image

అయితే ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా రఫ్ ఎడిటింగ్ అయిన ఔట్ పుట్ కింగ్ నాగార్జున చూశారన్నారు.

అయితే సినిమా అవుట్ ఫుట్ పట్ల నాగ్ అసంతృప్తిగా ఫీల్ అయ్యారని సోషల్ మీడియాలో గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్న విషయం విదితమే.అంతేకాకుండా ప్రొడ్యూసర్ సైడ్ నుంచి సినిమా చూసిన అల్లు అరవింద్ కి కూడా నచ్చకపోవడంతో రీ షూట్ చేయాలని డెసిషన్ తీసుకున్నారని న్యూస్ స్ప్రెడ్ అయింది.

అమెరికా షెడ్యూల్ తప్పితే మిగతా పోర్షన్ మొత్తం బాగాలేదన్నారు.

సినిమాను మళ్ళీ రీ షూట్ చేయాల్సిందే అని చిత్ర యూనిట్ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.అయితే దీనికి తగ్గట్టు ఈ సినిమాలో ఇప్పుడు దాదాపు 70 శాతం స్టోరీ మార్చేసి మళ్ళీ కొత్తగా రాస్తున్నారని సమాచారం.అయితే ప్రస్తుతం బొమ్మరిల్లు భాస్కర్ ఖాళీ సమయం దొరకడంతో అదే పని మీద ఉన్నారంట.

ఇక ఈ సినిమా ఫలితంపై అఖిల్ తో పాటు ‘బొమ్మరిల్లు’ భాస్కర్ కూడా బోలెడు ఆశలు పెట్టుకున్నారని చిత్ర సినిమాలో సమాచారం.అయితే అక్కినేని ఫ్యాన్స్ ఈ చిత్రంతోనైనా అఖిల్ సాలిడ్ హిట్ అందుకోవాలని కోరుకుంటున్నారు అందరు.

మరి ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమా అక్కినేని వారసుడికి ఎలాంటి రిజల్ట్ ఇవ్వబోతుందో వేచి చూడాల్సిందే మరి.

#Nagarjuna #Re Shoot #Akhil Akkineni #Pooja Hegde

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube

తాజా వార్తలు

Most Eligible Bachelor Movie Re Shoot Nagarjuna Related Telugu News,Photos/Pics,Images..