కొత్త పోస్టర్ తో వచ్చిన బ్యాచిలర్.. ట్రెండీ లుక్ లో అఖిల్!

అక్కినేని అఖిల్ పర్సెంట్ నటించిన సినిమామోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై అఖిల్ భారీ అంచనాలను పెట్టుకున్నాడు.ఈ సినిమా ఎప్పుడో విడుదల అవ్వాల్సి ఉండగా కరోనా కారణంగా వాయిదా పడుతూ వచ్చింది.

 Most Eligible Bachelor Movie New Poster Released, Most Eligible Bachelor, Akhil-TeluguStop.com

మొన్న జూన్ లో కూడా విడుదల చేయాలనీ అనుకున్నారు.కానీ మళ్ళీ సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.

అయితే ఎట్టకేలకు ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించింది.ఇక రిలీజ్ దగ్గర పడడంతో ఈ సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది చిత్ర యూనిట్.

ఈ సినిమా నుండి ఇప్పటికే విడుదల అయినా పోస్టర్స్, టీజర్, పాటలు మంచి రెస్పాన్స్ దక్కించు కున్నాయి.పాలు యూట్యూబ్ లో మిలియన్ వ్యూస్ దక్కించుకుంటూ ఈ సినిమాపై ఇంకా అంచనాలను పెంచేసాయి.

ఇక తాజాగా ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాను నుండి మరొక కొత్త పోస్టర్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్.ఈ పోస్టర్ చాలా కొత్తగా క్రియేటివ్ గా ఉంది.

ఈ పోస్టర్ లో అఖిల్ రకరకాల గెటప్స్ లో కనిపిస్తున్నాడు.ట్రెండీ లుక్ తో ఆకట్టు కుంటున్నాడు.

రకరకాల కాస్ట్యూమ్స్ వేసుకుని లుక్ తో అదర గొడుతున్నాడు.ఇక ఈ పోస్టర్ యుఎస్ఏ, హైదరాబాద్ బ్యాక్ డ్రాప్ లో ఉంది.

Telugu Akhil Akkineni, Poster, Pooja Hegde-Movie

ఇంకా ముందు ముందు మరిన్ని ఎక్సయిటింగ్ అప్డేట్ లతో రాబోతున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది.ఈ సినిమాకు గోపి సుందర్ సంగీతం అందించారు.ఇందులో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమాను జీఏ2 పిక్చర్స్ బ్యానర్ పై బన్నీ వాసు, వాసు వర్మ సంయుక్తంగా అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

Telugu Akhil Akkineni, Poster, Pooja Hegde-Movie

ఇక అఖిల్ ఈ సినిమాతో అయినా బ్లాక్ బస్టర్ హిట్ కొడతాడో లేదో వేచి చూడాలి.ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగానే అఖిల్ సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు.ఈ సినిమా షూటింగ్ ప్రెసెంట్ శరవేగంగా జరుగుతుంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube