లవర్స్ డే గిఫ్ట్‌గా బ్యూటీని పట్టుకొస్తున్న బ్యాచ్‌లర్  

Most Eligible Bachelor Heroine Pooja Hegde First Look On Valentines Day-most Eligible Bachelor,pooja Hegde,valentines Day

అక్కినేని యంగ్ హీరో అఖిల్ నటిస్తోన్న తాజా చిత్రం మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది.ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Most Eligible Bachelor Heroine Pooja Hegde First Look On Valentines Day-Most Pooja Day

ఇక ఈ సినిమా నుండి ప్రేమికుల రోజున మరో గిఫ్ట్ ఇస్తు్న్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.

ఈ సినిమాలో హీరోయిన్‌గా అందాల భామ పూజా హెగ్డే నటిస్తోన్న సంగతి తెలిసిందే.

ఆమెకు సంబంధించిన లుక్‌ను ప్రేమికుల రోజైన ఫిబ్రవరి 14న రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది.దీనికి సంబంధించి వారు ఓ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు.

వైభా అనే పేరుతో పూజా హెగ్డే ఈ చిత్రంలో నటిస్తోన్నట్లు తెలిపారు.ఆమె పాత్ర సినిమాలో చాలా వైవిధ్యంగా ఉంటుందని చిత్ర యూనిట్ తెలిపారు.

బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై ఇండస్ట్రీ వర్గాల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.ఈ సినిమాతో అఖిల్ ఎప్పటినుండో ఎదురుచూస్తున్న బ్లాక్‌బస్టర్ అందుకోవడం ఖాయమని అంటున్నారు చిత్ర యూనిట్.

మరి ఈ సినిమాలో పూజా హెగ్డే ఎలా ఉంటుందో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే.

తాజా వార్తలు

Most Eligible Bachelor Heroine Pooja Hegde First Look On Valentines Day-most Eligible Bachelor,pooja Hegde,valentines Day Related....