పూజ హెగ్డేతో ఉన్న వ్యక్తి ఎవరు.. ఆమెకు ఏం అవుతాడు?

ఒక లైలా కోసం సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన నటి పూజా హెగ్డే.మొదటి సినిమా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోయినప్పటికీ తన తరవాత సినిమాలతో ప్రేక్షకులను సందడి చేసిన ఈ బ్యూటీ ప్రస్తుతం హీరోలందరికీ ఈమె ఒక ఆప్షన్ గా మారిపోయింది.

 Most Eligible Bachelor Actress Pooja Hegde Photo With Her Brother Goes Viral-TeluguStop.com

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలందరి సరసన నటించిన ఈమె ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయి చిత్రాలలో నటిస్తూ మంచి గుర్తింపును సంపాదించుకున్నారు.కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉండే పూజా హెగ్డే సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.

ఈ క్రమంలోనే సోషల్ మీడియా వేదికగా పూజా హెగ్డే ఒక వ్యక్తితో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసింది.

 Most Eligible Bachelor Actress Pooja Hegde Photo With Her Brother Goes Viral-పూజ హెగ్డేతో ఉన్న వ్యక్తి ఎవరు.. ఆమెకు ఏం అవుతాడు-Latest News - Telugu-Telugu Tollywood Photo Image-TeluguStop.com

ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఈ క్రమంలోనే పలువురు నెటిజన్లు పూజా హెగ్డే తో కలిసి ఫోటో దిగిన వ్యక్తి ఎవరూ? అతనితో పూజాహెగ్డేకి ఉన్న సంబంధం ఏమిటి అంటూ ఆరా తీస్తున్నారు.పూజహెగ్డేతో కలిసి ఫోటోకి ఫోజులు ఇచ్చిన ఆ వ్యక్తి మరెవరో కాదు పూజ సోదరుడు రిషబ్ హెగ్డే.

పూజ తన సోదరుడితో కలిసి దిగిన ఫోటోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఈ ఫోటో కాస్త నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది.

Telugu Brother, Most Eligible Bachelor, Pooja Hegde, Rishab Hegdhe, Soacial Media, Tollywood-Movie

ఎప్పుడు తన కుటుంబ విషయాలను గురించి గాని కుటుంబ సభ్యులఫోటోలు గాని అభిమానులతో పంచుకోని పూజా హెగ్డే ఇలా తన సోదరుడితో కలిసి దిగిన ఫోటోలు షేర్ చేయడంతో ఇది కాస్త వైరల్ అయింది.ఇక సినిమాల విషయానికి వస్తే పూజా హెగ్డే నటించిన మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ దసరా కానుకగా విడుదల పాజిటివ్ టాక్ తో రన్ అవుతోంది.అదేవిధంగా ఈమె నటించిన ఆచార్య, రాధేశ్యామ్ చిత్రాలు కూడా విడుదలకు సిద్ధంగా ఉన్నాయి.

#Rishab Hegdhe #Brother #Pooja Hegde #Soacial

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube