పాము కరిస్తే చర్మం కొవ్వొత్తిలా కరిగిపోతుందంతే..  

Most Deadliest Snakes In The World-

పాము కరిస్తే చర్మం కరిగిపోతుంది మీరు చదివింది నిజమే.పాము కరిస్తే విషం ఎక్కుతుంది కాని చర్మం కరిగిపోవడం ఏంటి అనుకుంటున్నారా?.అయినా మనిషి చర్మం ఏమన్నా కొవ్వొత్తా కరిగిపోవడానికి అంటారా?? అవును నిజమే ఈ పాము కరిస్తే మనిషి చర్మం కొవ్వొత్తిలానే కరిగిపోతుంది..

Most Deadliest Snakes In The World--Most Deadliest Snakes In The World-

ఇంతకీ ఆ పాము పేరేంటి,ఏ జాతికి చెందింది,ఎక్కడ ఉంటుంది.ఇలా కొన్న ఆసక్తికరమైన విషయాలు మీకోసం.

· బంగారు వర్ణంలో మెరిసిపోతూ ఆకర్షణీయంగా కనిపించే ఆ పాము.ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైనది.ఆ పాము పేరే ‘గోల్డెన్ ల్యాన్స్‌హెడ్’.గోల్డెన్ ల్యాన్స్ హెడ్ కరిస్తే చర్మం కొవ్వొత్తులా కరిగిపోతుంది.

· బ్రెజిల్‌లోని సావో పౌలో తీరానికి 32 కిమీల దూరంలో ఉన్న ‘స్నేక్ ఐలాండ్‌’లో ఈ సర్పజాతి నివసిస్తోంది.110 చదరపు ఎకరాల విస్తీర్ణంలోని ఈ ద్వీపంలో 4000 పైగానే పాములు నివసిస్తున్నాయి.ఇక్కడ ప్రతి అడుగు విస్తీర్ణంలో ఒక్కో పాము ప్రత్యక్షమవుతుంది..

· గోల్డెన్ ల్యాన్స్‌హెడ్ విషయం సాధారణ పాము కంటే ఐదు రెట్లు అధికం.11,000 ఏళ్ల కిందట ఈ దీవి బ్రెజిల్‌తో కలిసి ఉండేది.అయితే, సముద్ర మట్టం పెరగడం వల్ల పర్వత ప్రాంతం దీవిగా విడిపోయింది.

· ఈ దీవిలో ప్రపంచంలోని అన్నిరకాల పాములు నివసిస్తున్నాయి.బ్రెజిల్ ప్రభుత్వం ఈ దీవిలోకి సాధారణ ప్రజల ప్రవేశాన్ని నిషేదించింది.కేవలం పరిశోధకులు, నేవీకి మాత్రమే అనుమతి ఉంది.

· ఆ దీవిలోకి ప్రవేశించడం అంత సులభం కాదు..

ఎంతో ధైర్యం ఉంటేనే ఈ ద్వీపంలో అడుగుపెట్టాలి.జారుడు స్వభావం కలిగిన రాళ్ల మీదకు ఎక్కుతూ దీవిలోకి వెళ్లాల్సి ఉంటుంది.

· 1909లో ఇక్కడ ఒక లైట్‌హౌస్ ఏర్పాటు చేశారు.దీని నిర్వహించే బాధ్యతను ఓ కుటుంబానికి ఇచ్చారు.

అయితే, 1920లో దీవిలోని పాములు వారి నివాసంలోకి ప్రవేశించి, వారిని చంపేశాయి.ఆ తర్వాత కొన్నాళ్లు లైట్‌హౌస్‌ను మూసివేశారు.ఇటీవల అక్కడ ఆటోమెటిక్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేశారు.

· ఈ దీవి గురించి తెలియని చాలామంది అక్కడికి వెళ్లి ప్రాణాలు కోల్పోయారు.