ఈ అలవాట్ల వల్లే కిడ్నీలు పాడవుతాయి  

 • ప్రతి ఏటా లక్షలమంది కిడ్ని సమస్యలతో ఆస్పత్రి మంచం ఎక్కుతున్నారు. రాళ్లు చేరడం నుంచి కిడ్ని పూర్తిగా పాడయ్యేవరకు అన్ని సమస్యలకి మనుషుల అలవాట్లే కారణం. కిడ్నీలను ఇబ్బంది పెడుతున్న ఆ అలవాట్లు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

 • * మూత్రాన్ని ఆపడం :

 • చాలామంది మూత్రాన్ని ఆపుతూ ఉంటారు. పరిస్థితులు అనుకూలించకపోతే, గంటలకొద్దీ మూత్రాన్ని అలాగే ఆపేవారు కూడా ఉన్నారు. ఇలా చేయడం వల్ల కిడ్నిలో రాళ్ళు చేరే పరిస్థితితో పాటు కిడ్నీ పూర్తిగా పాడయ్యే ప్రమాదం రావొచ్చు.

 • * తీపి ఎక్కువగా తినటం :

 • తీపివస్తువులు రుచికరంగా ఉంటాయి కాని, ఆరోగ్యానికి ఎన్నోరకలా ముప్పులు తెచ్చిపెడుతూ ఉంటాయి. ఫ్రుక్టోస్ అతిగా శరీరంలోకి చేరితే అది కిడ్నీలకు చాలా ప్రమాదం కావచ్చు. కావట్టి తీపి వస్తువులు ఎప్పుడోకాని తినకూడదు.

 • * అదుపు తప్పిన బ్లడ్ ప్రెషర్ :

 • ఎప్పుడో ఏదో ఒక సమస్య వస్తే తప్ప, బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకోవడం అలవాటు ఉండదు మనకు. ఇది చాలా తప్పు. రెగ్యులర్ గా బ్లడ్ ప్రెషర్ చేక్ చేసుకోని, రక్తప్రసరణను అదుపులో ఉంచుకోవాలి.

 • * పద్ధతిగా లేని మందుల వాడకం :

 • ప్రతీ చిన్న విషయానికి మందుమాత్రలు వాడటం కరెక్టు విషయం కాదు. అలాగే డాక్టరు చెప్పిన పద్ధతిలోనే మందులు వాడాలి. సమయం తప్పడం, లెక్కతప్పడం మీ కిడ్నీకి మంచిది కాదు.

 • * సిగరేట్లు, మద్యపానం :

 • కిడ్నీలకు అతిపెద్ద శతృవులు ఈ అలవాట్లు. మధుమేహం లాంటి జబ్బు ఉండి, ఈ అలవాట్లు కూడా ఉంటే అది ఇంకా ప్రమాదం.