ఎన్టీఆర్‌ ఫ్యాన్స్ మామూలు వాళ్లు కాదు, వారు కోరుకుంటే కొట్టేస్తారు

సోషల్ మీడియా రికార్డుల విషయంలో మెగా ఫ్యాన్స్ తర్వాతే మరెవ్వరు అయినా అన్నట్లుగా మొన్నటి వరకు పరిస్థితి ఉండేది.ఆన్‌ లైన్ రికార్డులు అన్ని కూడా పవన్‌ పేరు మీద లేదంటే ఇతర మెగా హీరోల పేరు మీద ఉండేవి.

 Most Commented Video In Tollywood Is Rrr Movie Ramaraju For Bheem, Ntr, Rajamoul-TeluguStop.com

కాని ఇప్పుడు ఆ రికార్డులను బ్రేక్‌ చేసేందుకు నందమూరి అభిమానులు ముందుకు వచ్చారు.వరుసగా నందమూరి అభిమానుల ట్విట్టర్ మరియు యూట్యూబ్ లో సరి కొత్త రికార్డులను బ్రేక్ చేస్తూ వస్తున్నారు.

ప్రస్తుతం రికార్డుల పరంగా చూస్తే యూట్యూబ్‌ లో టాలీవుడ్ నుండి ఎన్టీఆర్ కు తిరుగు లేని రికార్డు ఉంది.మరో ఇండియన్ సినిమాకు దక్కని ఘనతను ఎన్టీఆర్ వీడియోకు ఆయన అభిమానులు కట్టబెట్టడంతో పాటు మరింత ముందుకు తీసుకు వెళ్తున్నారు.

వ్యూస్‌ పరంగా సాధ్యం కాదు కాని ఖచ్చితంగా కామెంట్స్ పరంగా ఎన్టీఆర్‌ కు సరికొత్త రికార్డును నమోదు చేయాలని నందమూరి అభిమానులు భావించారు.అనుకున్నదే తడవుగా యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ అద్బుతమైన రామరాజు ఫర్ భీమ్ వీడియో ను కామెంట్లతో ముంచెత్తారు.

ఆర్ఆర్‌ఆర్‌ సినిమా నుండి వచ్చిన ఆ వీడియోలో ఎన్టీఆర్ లుక్ అదిరి పోయింది.దానికి తోడు అద్బుతమైన విజువల్స్‌ మరియు బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌.దాంతో సినిమా రికార్డుల వర్షం కురిసేలా బాక్సాఫీస్ దద్దరిలేలా వసూళ్లు నమోదు అవ్వడం ఖాయం అంటున్నారు.వసూళ్ల విషయం పక్కన పెడితే ఎన్టీఆర్ కొమురం భీమ్‌ టీజర్ కు భారీ ఆధరణ దక్కింది.

వ్యూస్‌.లైక్స్‌ కామెంట్స్ ఇలా అన్ని విధాలుగా రికార్డులను బద్దలు కొడుతూ వచ్చింది.

ఎన్టీఆర్‌ అభిమానులు గట్టిగా తల్చుకుంటే కానిది ఏమీ లేదని ఈ కామెంట్స్ రికార్డుతో తేలిపోయింది.దాదాపుగా 12 లక్షల వరకు కామెంట్స్ నమోదు అయ్యాయి.

ఆ సంఖ్య ఇంకా కొనసాగుతూనే ఉంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube