ఇకపై ఏటీఎం తిప్పలు తప్పవా ..?

మన బ్యాంక్ అకౌంట్ లో డబ్బులు ఉంటె చాలు ఎప్పుడు బడితే అప్పుడు … ఎక్కడ ఎటిఎం కనిపిస్తే చాలు అక్కడ డబ్బు లు విత్ డ్రా చేసుకుని ఖర్చుబెట్టేసుకుంటుంటాము.అయితే ఇకపై అలాంటి అవకాశం ఉండదేమో.

 Most Atm Centers Are Closed-TeluguStop.com

ఇప్పటికే ఉన్న ఏటీఎంలలో సగం పైగా పనిచేయడం లేదు.ఉన్న వాటిల్లో సరిగ్గా మెయింటినెన్స్ లేదు.

చాలా చోట్ల ఏటీఎంలు మూతబడి ఉండడమో… నో క్యాష్ అనే బోర్డులు ఉండడమో చేస్తున్నాయి.

అయితే ఇదంతా ఒక వ్యూహంలో భాగమట.దేశ వ్యాప్తంగా ఇప్పటి వరకు ఉన్న 2,38,000 ATM సెంటర్లలో సగం ATMలు మార్చి 2019 నాటికి పూర్తిగా నిలిచిపోబోతున్నాయి.తాజాగా… ATM సమాఖ్య (CATMi) ప్రభుత్వం అనుసరిస్తున్న డిజిటలైజేషన్ పాలసీల్లో భాగంగా ఈ మార్పులన్నీ చోటు చేసుకోబోతున్నాయని అభిప్రాయపడింది.ముఖ్యంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ATMల నిర్వహణ విషయంలో ఇటీవల తీసుకొచ్చిన మార్గదర్శకాలు అమలు చేయాలంటే బ్యాంకుల మీద అధికంగా భారం పడుతుందని, దాంతో దేశవ్యాప్తంగా 1,13,000 ATMలు మార్చి 2019 నాటికి మూతబడతాయని ఆ సమాఖ్య వెల్లడించింది.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన నియమాలు ఇవే.ATM మెషీన్లను నిర్వహించే సంస్థలు 100 కోట్ల నికర పెట్టుబడి కలిగి ఉండాలి, అలాగే అన్ని సౌకర్యాలు కలిగిన 300 క్యాష్ వ్యాన్లని కలిగి ఉండాలి, నగదు నింపే ఇద్దరు వ్యక్తులు, మరో ఇద్దరు సెక్యూరిటీ గార్డులు, ఒక డ్రైవర్ మొత్తం ఐదు మంది ప్రతీ క్యాష్ వ్యాన్‌లోనూ ఉండాలి.ప్రతీ క్యాష్ వ్యాన్‌లోనూ GPS, CCTV సౌకర్యాలు ఉండాలి.

వీటితోపాటు దేశంలో ఉన్న అన్ని ఏటీఎం మిషన్ల‌లో ప్రస్తుతము వాడబడుతున్న Windows XP ఆపరేటింగ్ సిస్టం తనంలో Windows 10 ఇన్‌స్టాల్ చేయాలి.అలాగే నగదు నింపడానికి క్యాసెట్ స్వాప్ విధానాన్ని అనుసరించాలి.

ఈ నియమాలను పాటించాలంటే తప్పనిసరిగా ప్రతీ నెలా ప్రతీ ATMకీ సగటున 1,50,000 రూపాయలు ఖర్చవుతుందని, దేశవ్యాప్తంగా ఉన్న 2,38,000 ATMలకు ఇంత పెద్ద మొత్తంలో ఖర్చు పెట్టాలంటే బ్యాంకులకు చాలా ఆర్థిక భారం అవుతుందని, అందుకే ఫిబ్రవరి 9, 2019న ఏరోజైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ మార్పులన్నీ తీసుకురావడానికి గడువు విధించిందో ఆరోజు తర్వాత ATMల సంఖ్య భారీగా తగ్గిపోయే అవకాశం కనిపిస్తోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube